జ్యోతి పూర్వాజ్ న్యూ కిల్లర్ లుక్
ఫోటోలలో ఆమె చూపుల్లో తేలిపోతున్న ధైర్యం, ఆత్మవిశ్వాసం నెటిజన్లను ఆకర్షిస్తోంది.
By: Tupaki Desk | 3 Dec 2024 12:30 AM GMTజ్యోతి పూర్వాజ్ తన తాజా ఫోటోలతో అభిమానులను మరోసారి ఆకట్టుకున్నారు. ఆమె పోస్ట్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నలుపు రంగు సన్నని డ్రెస్‌లో, గ్లామర్ షో చేస్తున్న ఆమె తన అందంతో చూసే వారిని కట్టిపడేస్తున్నారు. ఫోటోలలో ఆమె చూపుల్లో తేలిపోతున్న ధైర్యం, ఆత్మవిశ్వాసం నెటిజన్లను ఆకర్షిస్తోంది. అలాగే కిల్లర్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
జ్యోతి పూర్వాజ్ కెరీర్ విషయానికి వస్తే, తెలుగు టీవీ ప్రేక్షకులకు ఆమె పెద్దగా పరిచయం అక్కర్లేదు. గుప్పెడంత మనసు వంటి సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీ అయ్యారు. ఇటీవల ఆమె తన భర్త పూర్వాజ్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇప్పుడున్న సోషల్ మీడియాలో తన అందంతో, ఫొటోలతో సందడి చేస్తూ అభిమానుల మధ్య యాక్టివ్‌గా ఉండడం ఆమె ప్రత్యేకత. ఇటీవల గోల్డెన్ టచ్‌తో, మోడ్రన్ లుక్‌లో ఫోటోలు షేర్ చేయగా అందరికీ బాగా నచ్చాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఆమె అందానికి కామెంట్స్ చేయకుండా ఉండలేకపోతున్నారు.
జ్యోతి పూర్వాజ్ తన కెరీర్‌లో కొత్త మలుపు తీసుకుంటున్నారు. వెబ్ సిరీస్‌లు, చిన్న చిత్రాలతో పాటు, తన భర్త డైరెక్ట్ చేసిన సినిమాలో నటించడం విశేషం. ఆమె గ్లామర్ షో మాత్రమే కాకుండా తన యాక్టింగ్ స్కిల్స్‌తోనూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరి రాబోయే ప్రాజెక్ట్స్‌తో ఆమె కెరీర్ ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి. ఇక సోషల్ మీడియాలో అమ్మడు గ్లామర్ తోనే తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.