రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఆమే!
తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. అతడు ఆడించే ఆటలో గెలవడానికి మూర్ఖత్వంతో కూడిన తన మాటలు వినకండి` అనే వ్యాఖ్యల్ని జ్యోతిక జోడించారు.
By: Tupaki Desk | 26 Jan 2024 2:30 PM GMTజ్యోతిక పెళ్లైన తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ లో ఎంతో సెలక్టివ్ గా ముందుకెళ్తోన్న సంగతి తెలిసిందే. అదీ చాలా గ్యాప్ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతో జాగ్రత్తగా తెలివైన నిర్ణయాలతో ముందు కెళ్తున్నారు. కంటెంట్ కి ప్రాధాన్యమున్న సినిమాల్లోనే నటిస్తున్నారు. పాత్రల పరంగా తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపు వస్తుంది అంటేనే ఆ సినిమా చేస్తున్నారు. ఈ క్రమంలో మలయాళంలోనూ సినిమాలు చేస్తున్నారు.
ఇలా ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత కూడా జ్యోతిక సినిమాలు చేయడం విశేషం. ఓవైపు సూర్య కి వైఫ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ నటిగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ భాషల నుంచి అనేక అవకాశాలు వస్తున్నాయి. కానీ జ్యోతిక మాత్రం అన్ని సినిమాలు చేయడం లేదు. చాలా రేర్ గానే కమిట్ అవుతున్నారు. ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె సింపుల్ గా నో చెప్పేస్తున్నారు.
అలాంటి జ్యోతిక మళ్లీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తారని ఎవరైనా ఊహించగలరా? కానీ ఇప్పుడది జరిగింది. దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత జ్యోతిక మళ్లీ బాలీవుడ్ లో తెరంగేట్రం చేస్తున్నారు. అజయ్ దేవగణ్..ఆర్ మాధనవ్ ప్రధాన పాత్రల్లో వికాస్ బహ్ల్ తెరకెక్కిస్తోన్న `షైతాన్` అనే చిత్రంలో జ్యోతిక నటిస్తున్నారు. ఇందు లో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. దానికి సంబంధించి ఆమె స్వయంగా విషయాన్ని రివీల్ చేసారు.
తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. అతడు ఆడించే ఆటలో గెలవడానికి మూర్ఖత్వంతో కూడిన తన మాటలు వినకండి` అనే వ్యాఖ్యల్ని జ్యోతిక జోడించారు. హరర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాతో పాటు జ్యోతిక హిందీలో మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీ అనే చిత్రంతో పాటు డబ్బా కార్టెల్ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. జ్యోతిక చివరిగా బాలీవుడ్ లో `లిటిల్ జాన్` అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత హిందీ మినహా ఇతర భాషల్లోనే నటించారు.