Begin typing your search above and press return to search.

'క' డైరెక్టర్స్.. ప్లాన్ అదిరిపోయిందిగా..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు కొత్త డైరెక్టర్స్ పరిచయమవుతూనే ఉంటారు. ఆ విషయం అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Jan 2025 4:25 PM GMT
క డైరెక్టర్స్.. ప్లాన్ అదిరిపోయిందిగా..
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు కొత్త డైరెక్టర్స్ పరిచయమవుతూనే ఉంటారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే అందులో కొందరు మాత్రమే డెబ్యూతో మంచి హిట్ ను అందుకుంటారు. మరికొందరు మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రశంసలు సొంతం చేసుకుంటారు. ఇంకొందరు ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేస్తారు.

అలాంటి కోవకు చెందుతారు 'క' సినిమా డైరెక్టర్స్ సుజిత్, సందీప్. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ఆ సినిమా.. గత ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 1970 స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఆ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. సరికొత్త కంటెంట్ తో రూపొందిన ఆ చిత్రం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.

అలా తొలి అడుగులోనే సత్తా చాటారు సుజిత్, సందీప్. తమ మేకింగ్ తో ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే తెలంగాణలో మధ్యాహ్నమే చీకటి పడే ఊరు ఉండగా.. దాని దృష్టిలో పెట్టుకుని సినిమా కోసం క్రిష్ణగిరి గ్రామాన్ని క్రియేట్ చేసి మెప్పించారు. తమదైన శైలిలో క్లైమాక్స్‌ డిజైన్ చేసి ఫిదా చేశారు. పట్టుదలగా సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

త్వరలో 'క' మూవీ ప్రీక్వెల్ ను కూడా చేయనున్నారు. క్రిష్ణగిరి నేపథ్యమేంటి అన్నది అందులో చూపించనున్నారు. ఇప్పటికే ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఇప్పుడు వారిద్దరు ప్రెస్టీజియస్ బ్యానర్స్ లో ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమ కొత్త సినిమాలను బిగ్ కాన్వాస్ లో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ లోని పలు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు.. సుజిత్- సందీప్ ద్వయంతో సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటి ట్రెండ్ కు తగినట్లు ఫ్రెష్ కంటెంట్, ఇన్నోవేటివ్ స్క్రీన్ ప్లేతో కొత్త మూవీస్ చేసేందుకు సుజిత్, సందీప్ కూడా సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ లను రెడీ చేసుకుంటున్నారట.

ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు క్రియేటివ్ గా సుజిత్, సందీప్ కాంపౌండ్ నుంచి రాబోయే సినిమాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'క' ప్రీక్వెల్ తో పాటు అప్ కమింగ్ మూవీస్ కోసం వెయిటింగ్ అని చెబుతున్నారు. ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ తెలియజేస్తున్నారు.