‘క’ కోసం ఆడియెన్స్ డిమాండ్.. లెక్క పెరిగింది
యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ సినిమా దీపావళి సీజన్లో అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలుస్తోంది.
By: Tupaki Desk | 2 Nov 2024 9:41 AM GMTయువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ సినిమా దీపావళి సీజన్లో అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలుస్తోంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన భారీ స్పందనకు, పొజిటివ్ మౌత్ టాక్‌కు తోడు ఆదరణ పెరుగుతుండటంతో ఈ చిత్రం విజయ పథంలో దూసుకుపోతోంది. సుజిత్ - సందీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. సినిమాను చూసిన వారికి నచ్చడంతో సోషల్ మీడియాలో క్రేజ్ పెరిగింది. ఇక సినిమా థియేటర్ లెక్క పెంచుకునే దిశగా KA ముందుకు సాగబోతోంది.
తాజాగా, ప్రేక్షకుల డిమాండ్ నేపథ్యంలో ‘క’ సినిమాకు 186 స్క్రీన్స్ దేశవ్యాప్తంగా అదనంగా పెంచారు. దీపావళి పండుగ సీజన్లో విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ విజయాన్ని సాధించింది. మొదటిరోజు నుంచే మంచి కలెక్షన్లు రాబట్టిన ‘క’ సినిమాకు ఈ అదనపు స్క్రీన్స్ ద్వారా మరింత క్రేజ్ లభిస్తోంది. సామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం యాక్టింగ్‌తో పాటు, సంగీతం, సస్పెన్స్ థ్రిల్లింగ్ కంటెంట్‌ను ప్రేక్షకులు ఎంతగానో అభినందిస్తున్నారు.
సినిమా కథ, కథనం అన్నీ అంశలు కూడా యంగ్ ఆడియెన్స్ నుంచి సీనియర్ ప్రేక్షకుల వరకు అందరినీ ఆకట్టుకోవడం విశేషం. ఫలితంగా ఈ చిత్రం మంచి ఆదరణ పొందుతూ దీపావళి విన్నర్‌గా నిలిచింది. అమెరికాలో కూడా ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. రెండు రోజుల్లోనే క సినిమా అక్కడ 330K డాలర్లను రాబట్టడం విశేషం. ఇది కిరణ్ అబ్బవరం కెరీర్లో అత్యుత్తమ వసూళ్లలో ఒకటిగా నిలిచింది.
దీంతో, కిరణ్ అబ్బవరం ప్యాన్ ఇండియా స్థాయిలో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకుంటున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విజయోత్సవంలో భాగంగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు సైతం మంచి లాభాలను అందిస్తుంది. ప్రారంభ మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదనపు స్క్రీన్స్ తో ఈ సినిమా మరింత రికార్డులకెళ్లే అవకాశం ఉంది. ఇటువంటి విజయాలతో కిరణ్ అబ్బవరం తన కెరీర్లో మరో కీలక అడుగు ముందుకు వేస్తున్నాడు. ఈ సినిమాతో అందించిన నమ్మకంతో సుజిత్, సందీప్ లాంటి డైరెక్టర్లు మంచి స్థాయి ఎంటర్టైన్మెంట్ను అందించగలరని నిరూపించుకున్నారు.