Begin typing your search above and press return to search.

తమన్నా హీటెక్కించే సాంగ్.. ఇక తెలుగులో షురూ

ఈ పాట ను ఆన్ లైన్ విడుదల చేశారు. ఈ పాటను హీరో రానా విడుదల చేయడం విశేషం.

By:  Tupaki Desk   |   26 July 2023 1:25 PM GMT
తమన్నా హీటెక్కించే సాంగ్.. ఇక తెలుగులో షురూ
X

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ లో రజినీకాంత్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ నుంచి ఓ పాట విడుదల చేయగా, ఫుల్ హిట్ అయ్యింది.

'వా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి' అంటూ సాగే ఈ పాట బాగా ట్రెండ్ అయ్యింది. ఎవరి నోట విన్నా ఇదే పాట వినపడుతోంది. అందరూ రీల్స్ ఈ పాటకే చేస్తున్నారు. కాగా, ఇప్పుడు ఈ పాట ను తెలుగులోనూ విడుదల చేశారు. నిజానికి ఈ పాట ను చాలా గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకున్నారు.

హైదరాబాద్‌ లోని సీఎమ్ఆర్‌ కాలేజ్‌ లో నేడు మిల్కీ బ్యూటీ తమన్నా చేతుల మీద లాంచ్ చేయించాలని అనుకున్నారు. కానీ, వర్షాలు మేకర్స్ ప్లాన్ ని రివర్స్ చేసేశాయి. దీంతో, ఈ ఈవెంట్‌ ను ర‌ద్దు చేసి, ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల కు ఈ పాట ను ఆన్ లైన్ విడుదల చేశారు. ఈ పాటను హీరో రానా విడుదల చేయడం విశేషం. అనిరుధ్ ఈ సినిమా కి మ్యూజిక్ అందించగా, ఈ పాటను మాత్రం సింధూజ శ్రీనివాసన్ ఆలపించారు.

తెలుగు లోనూ పాట వినసొంపుగా ఉంది. లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. చాలా పాటలు ఒక భాషలో క్లిక్ అయిన తర్వాత, మరో భాషలో వినడానికి అంత వినసొంపుగా ఉండవు. కానీ, ఈ పాట మాత్రం అలా కాదు. ఒరిజినల పాటను వింటున్న అనుభూతే కలిగింది. ఈ పాట కూడా తెలుగు లో రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ జైలర్ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌, టాలీవుడ్ నటుడు సునిల్‌, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ, యోగిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.