ఆ స్టార్ హీరో కోసం 14 దేశాల నుంచే దించారా?
70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 350 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
By: Tupaki Desk | 16 Aug 2024 6:48 AM GMTసల్మాన్ ఖాన్ కథానాయకుడిగా కబీర్ ఖాన్ తెరకెక్కించిన 'ఏక్ థా టైగర్' ఎలాంటి విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. యశ రాజ్ ఫిలింస్ ఈ సినిమాతో స్పైజానర్ చిత్రాల్లోకి ఎంటర్ అయింది. తొలి సినిమాతోనే ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. టైగర్-జోయాల ప్రేమ కథకు యాక్షన్ అంశాల్ని జోడించి రూపొందించిన సినిమా వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేసింది.70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 350 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
అప్పటి నుంచి వైఆర్ ఎఫ్ బ్యానర్లో స్పై జానర్ సినిమాల వేగం పెరిగింది. కొంత కాలంగా ఆ జానర్ చిత్రాల్నే ఎక్కువగా నిర్మిస్తున్నారు. మరి `ఏక్ థా టైగర్` సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అంతగా హైలైట్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే ఇంతకాలం బాలీవుడ్ స్టంట్ మాస్టర్లు కారణంగా అవి అంతగా పండాయనుకున్నారు. కానీ దీని వెనుక వాళ్ల కష్టంతో పాటు అంతకు మించి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ల కృషి ఉందన్న విషయాన్ని కబీర్ ఖాన్ రివీల్ చేసారు.
ఈ సినిమా విడుదలై గురవారంతో 12 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్బంగానే ఆ సీక్రెట్ రివీల్ చేసారు. వైఆర్ ఎఫ్ బ్యానర్లో రూపొందిన మొదటి యాక్షన్ సినిమా ఇది. అందుకే ఈ ప్రాజెక్ట్ ని ప్రత్యేకంగా తీర్చిదిద్దాం. సల్మాన్ టైగర్ పాత్రలో చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఎంతగానే మెప్పించాయి. అందుకు కారణం 14 దేశాలకు చెందిన స్టంట్ మాస్టర్లు. వాళ్ల కారణంగా యాక్షన్ సన్నివేశాలు అంత గొప్పగా వచ్చాయి.
ఆ ఫైటర్ల అందరిది ఎంతో సుదీర్ఘ అనుభవం. ఇంతకాలం ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. అలాంటి సందర్భం కూడా రాలేదు. కానీ ఈ విషయాన్ని దాయకూడదనిపించింది. మన మాస్టర్లతో పాటు వాళ్లు కూడా ఎంతో కష్టపడ్డారు. అందుకే యాక్షన్ సన్నివేశాలు గొప్పగా వచ్చాయి` అని అన్నారు.