Begin typing your search above and press return to search.

భార్య చెప్పడం వల్లే 'అర్జున్‌ రెడ్డి'గా మారాడట!

అయితే ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మొదట అర్జున్ రెడ్డి తో నా వద్దకు వచ్చిన సమయంలో నో చెప్పాను

By:  Tupaki Desk   |   7 Oct 2023 4:30 PM GMT
భార్య చెప్పడం వల్లే అర్జున్‌ రెడ్డిగా మారాడట!
X

విజయ్‌ దేవరకొండను రౌడీ స్టార్‌ గా.. క్రేజీ హీరోగా మార్చిన చిత్రం 'అర్జున్‌ రెడ్డి'. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన అర్జున్‌ రెడ్డి తెలుగు లో సెన్షేషనల్‌ సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో తమిళ్ మరియు హిందీలో రీమేక్ చేయడం జరిగింది. తెలుగు లో మించి హిందీలో ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు మూడు నాలుగు రెట్ల అధిక వసూళ్లు కూడా నమోదు అయ్యాయట.

అర్జున్ రెడ్డిని హిందీలో సందీప్ వంగ కబీర్ సింగ్‌ టైటిల్‌ తో షాహిద్ కపూర్ హీరో గా రీమేక్ చేశాడు. 2019 లో విడుదల అయిన కబీర్ సింగ్‌ ఆ ఏడాది బిగ్గెస్ట్‌ హిట్ చిత్రాల జాబితాలో నిలిచింది అనడంలో సందేహం లేదు. భారీ వసూళ్లు సాధించిన ఆ సినిమా విషయంలో హీరో షాహిద్ కపూర్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కబీర్ సింగ్ కథ లో చూపించకూడనిదంతా చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మొదట అర్జున్ రెడ్డి తో నా వద్దకు వచ్చిన సమయంలో నో చెప్పాను. నేను ఇలాంటి కథను చేయడం కుదరదు అన్నట్లుగా చెప్పాను. కానీ నా భార్య మీరా కచ్చితంగా ఆ సినిమా రీమేక్ చేయమని చెప్పడంతో ఒప్పుకున్నాను.

విజయ్ దేవరకొండ స్థాయిలో పాత్రకు న్యాయం చేస్తానా లేదా అనే అనుమానం నాలో ఉండేది. కానీ మీరా మాత్రం పూర్తిగా నన్ను నమ్మింది. తప్పకుండా కబీర్‌ సింగ్ తో ది బెస్ట్‌ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంటావు అన్నట్లుగా నాతో పలు సార్లు చెప్పింది. కబీర్ సింగ్‌ నిర్ణయం అనేది కెరీర్‌ లో పెద్దదిగా భావించాను.

మీరా సరైన ఆలోచన చేసింది.. నాపై నా కంటే కూడా తనకు ఎక్కువ నమ్మకం ఉంది అనిపించింది. ప్రేక్షకులు నిన్ను ప్రేమ కథల్లో చూడాలని ఆశ పడుతున్నారు. కనుక నువ్వు ఈ సినిమాను చేస్తే తప్పకుండా అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆధరిస్తారు అంటూ మీరా నాతో షూటింగ్‌ సందర్భంగా పలు సార్లు అన్నది. తను అన్నట్లుగానే కబీర్ సింగ్ సెన్షేషనల్‌ విజయాన్ని సొంతం చేసుకుంది.