కడప టాప్ 10 గ్రాసర్స్.. పుష్ప 2 లెక్క ఎంతంటే?
తెలుగు సినిమా ప్రపంచంలో బాహుబలి తరువాత అత్యధిక క్రేజ్ అందుకున్న మూవీ పుష్ప 2: ది రూల్. సినిమా విడుదలై 7 వరాలు దాటినా ఇప్పటికీ హవా కొనసాగిస్తోంది.
By: Tupaki Desk | 24 Jan 2025 7:57 AM GMTతెలుగు సినిమా ప్రపంచంలో బాహుబలి తరువాత అత్యధిక క్రేజ్ అందుకున్న మూవీ పుష్ప 2: ది రూల్. సినిమా విడుదలై 7 వరాలు దాటినా ఇప్పటికీ హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా మాస్ ఏరియాలలో మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక కడప నగరంలో కూడా సినిమా అభిమానులు పుష్ప 2 కోసం భారీగా థియేటర్లకు తరలివచ్చారు. 50 రోజుల్లో రూ. 3.17 కోట్లు గ్రాస్ సాధించి, కడపలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా గానూ నిలిచింది.
అల్లు అర్జున్ నటన, సుకుమార్ స్క్రీన్‌ప్లే సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా ప్రేక్షకులను థియేటర్లకు లాక్కొచ్చాయని చెప్పవచ్చు. పాన్ ఇండియా లెవెల్‌లో రూ. 1800 కోట్లు గ్రాస్ సాధించిన ఈ చిత్రం, కడపలో కూడా తనదైన పట్టు చూపించింది. ఇంతకు ముందు ఆర్‌ఆర్‌ఆర్ ఈ జాబితాలో టాప్‌లో ఉండేది.
రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా కడపలో రూ. 3.14 కోట్ల గ్రాస్ సాధించి, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటనకు, ఎమోషనల్ కథనానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే, పుష్ప 2 తాజాగా ఈ రికార్డును బద్దలు కొట్టి టాప్‌లో నిలిచింది. మరోవైపు, ఎన్టీఆర్ నటించిన దేవర కడపలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు రూ. 2.36 కోట్లు వసూలు చేసి, జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఎన్టీఆర్ మాస్ అప్పీల్, కొరటాల శివ కథనం ఈ సినిమాను కడప ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దాయి.
ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న రాజమౌళి బాహుబలి 2 రూ. 2.30 కోట్లతో అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ, సలార్ వంటి చిత్రాలు కూడా కడపలో మంచి వసూళ్లను సాధించాయి. కల్కి 2898 ఏడీ రూ. 2.19 కోట్లు, సలార్ రూ. 1.88 కోట్లతో మంచి బూస్ట్ ఇచ్చాయి. ఈ చిత్రాల టెక్నికల్ గ్రాండియర్, కథన పటిమ కడప ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అల.. వైకుంఠపురములో, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలు కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించాయి. అల.. వైకుంఠపురములో రూ. 1.54 కోట్లు, వాల్తేరు వీరయ్య రూ. 1.50 కోట్లు వసూలు చేశాయి.
కడప టాప్ 10 గ్రాసర్స్ జాబితా:
1. పుష్ప 2: ది రూల్ - ₹3,17,06,962 (50D)
2. ఆర్‌ఆర్‌ఆర్ - ₹3,14,40,812
3. దేవర - ₹2,36,20,250
4. బాహుబలి 2 - ₹2,30,89,976
5. కల్కి 2898 ఏడీ - ₹2,19,96,000
6. సలార్ - ₹1,88,00,000
7. అల వైకుంఠపురములో - ₹1,54,78,949
8. వాల్తేరు వీరయ్య - ₹1,50,44,600
9. బాహుబలి - ₹1,35,76,412
10. సంక్రాంతికి వస్తున్నాం - ₹1,33,84,750 (10D)