స్టార్ హీరోయిన్ కి చిక్కులు తప్పట్లేదు..!
ఒకప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఇప్పుడు అవకాశాల్లేక సతమతమవుతుంది.
By: Tupaki Desk | 26 Oct 2024 5:12 AM GMTఒకప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఇప్పుడు అవకాశాల్లేక సతమతమవుతుంది. కెరీర్ పీక్స్ లో స్టార్ హీరోలందరితో నటించిన ఈ అమ్మడు సడెన్ గా ప్రియుడితో మ్యారేజ్ అంటూ షాక్ ఇచ్చింది. పెళ్లైనా సరే సినిమాలు చేస్తుంది అనుకుంటే వెంటనే ఒక పిల్లాడిని కనేసింది. పెళ్లై పిల్లలు పుట్టాక సాధారణంగానే ఫేస్ లో కొంత గ్లో మిస్ అవుతుంది. అయినా కూడా మళ్లీ తెర మీద తన టాలెంట్ చూపించాలని అనుకుంది. కానీ ఎందుకో అమ్మడికి ఆశించిన రేంజ్ లో అవకాశాలు రావట్లేదు.
ఒకప్పుడు సౌత్ లో టాప్ స్టార్ గా ఉన్న ఆ హీరోయిన్ కు ఇప్పుడు ఛాన్స్ లు లేక ఖాళీగా ఉంటుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ ఎందుకు ఆమెకు ఆఫర్లు రావట్లేదు అంటే.. ఆ హీరోయిన్ మన చందమామ కాజల్. అదేంటో పెళ్లై పిల్లలు ఉన్నా సరే కొందరు పెళ్లికి ముందు ఎలా ఉన్నారో అలానే కనిపిస్తారు కానీ కాజల్ లో మాత్రం చాలా మార్పులు కనిపిస్తున్నాయి. కాస్త ముదురు ముఖం పడినట్టు అనిపిస్తున్న ఈ అమ్మడికి హీరోయిన్ ఛాన్స్ లు కరువయ్యాయి.
లాస్ట్ ఇయర్ బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమా చేసి సక్సెస్ అందుకున్న కాజల్ ఈమధ్యనే సత్యభామ సినిమాతో సర్ ప్రైజ్ చేసింది. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఇప్పుడు అసలు ఒక్క అవకాశం కూడా ఆమెకు రావట్లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ కొంతమంది హీరోయిన్స్ కి ఈ చిక్కులు తప్పవు. కాజల్ తన పంథా మార్చి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని చూస్తున్నా కూడా ఆ ఛాన్స్ లు కూడా కరువయ్యాయి.
ఈమధ్య ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నా కూడా వాటి నుంచి కూడా కాజల్ ని తప్పించారని టాక్. ప్రస్తుతం మన స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అలాంటి సినిమాలో కాజల్ ని తీసుకోవడం కష్టమే. కానీ అమ్మడు మాత్రం తనకు ఒక ఛాన్స్ ఇస్తే తన టాలెంట్ చూపిస్తానని అంటుంది. ఏది ఏమైనా కాజల్ కి ప్రస్తుతం కెరీర్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. కంప్లీట్ ఫ్యామిలీ ఉమెన్ గా మారినట్టు కనిపిస్తున్న కాజల్ సోషల్ మీడియాలో కూడా తన భర్తతో దిగిన ఫోటోలు, కొడుకు ఫోటోలతో మాత్రమే కనిపిస్తుంది.