Begin typing your search above and press return to search.

చంద‌మామ ముసిముసి న‌వ్వుల బుడ‌మేరు

ఇదిగో ఇక్క‌డ.. స్వేచ్ఛ‌గా స్వ‌చ్ఛంగా న‌వ్వితే ఎలా ఉంటుందో చంద‌మామ మోము చూసి చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   8 Sep 2024 5:19 AM GMT
చంద‌మామ ముసిముసి న‌వ్వుల బుడ‌మేరు
X

చంద‌మామ ముసిముసి న‌వ్వుల వ‌ర‌ద‌ను చూసారా? ఇదిగో ఇక్క‌డ.. స్వేచ్ఛ‌గా స్వ‌చ్ఛంగా న‌వ్వితే ఎలా ఉంటుందో చంద‌మామ మోము చూసి చెప్పొచ్చు. జాబిల్లి న‌వ్వితే అది ఎంత ప‌సందుగా ఉంటుందో ఈ న‌వ్వు చూస్తే అర్థ‌మ‌వుతుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ ని చూసి తెలుగు ఆడియెన్ కి చాలా కాల‌మే అయింది. ప్ర‌స్తుతం త‌న కుమారుడు నీల్, భ‌ర్త గౌత‌మ్ కిచ్లుతో సంసార జీవ‌నంలో నిమ‌గ్న‌మై ఉంది. ఆనందాల నిల‌యం నుంచి ఇప్ప‌ట్లో బ‌య‌ట‌ప‌డేట్టు లేదు.

చంద‌మామ పెద్ద తెర‌కు తిరిగొస్తుందా లేదా? అన్న‌ది అటుంచితే..గ‌తంలో వ‌చ్చిన అవ‌కాశాల్ని కూడా ఈ భామ తిర‌స్క‌రించింది. ఇండియ‌న్ 2లో చివ‌రిగా క‌నిపించింది. ఇండియ‌న్ 3లో క‌నిపిస్తుంద‌ని కూడా చెబుతున్నారు. కానీ ఈ సినిమా రావడానికి ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంది. మంచు విష్ణు క‌న్నప్ప‌లోను కాజ‌ల్ క‌నిపించ‌నుంది. కానీ ఒక పూర్తి స్థాయి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో ఈ భామ న‌టించే అవ‌కాశం ఇప్ప‌ట్లో క‌నిపించ‌డం లేదు.

గౌత‌మ్ కిచ్లుతో క‌లిసి చంద‌మామ పూర్తిగా ఆనంద‌మ‌య జీవ‌నాన్ని ఆస్వాధిస్తోంది. త‌న ఇన్ స్టా ప్రొఫైల్ లో అందుకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. త‌న త‌దుప‌రి ప్రాజెక్టుల‌కు సంబంధించిన ఎలాంటి స‌మాచారాన్ని కాజ‌ల్ ఇవ్వ‌డం లేదు. కుమారుడు నీల్ కిచ్లుతోను ఆనంద‌క‌ర స‌మ‌యాన్ని ఆస్వాధిస్తోంది. మ‌ధ్య‌లో అప్పుడ‌ప్పుడు కాజ‌ల్ ఫ్యాష‌న్ సెన్స్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ని షేర్ చేస్తోంది.