Begin typing your search above and press return to search.

సెకెండ్ ఇన్నింగ్స్ లో చంద‌మామ‌కి బంప‌ర్ ఆఫ‌ర్!

చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ వివాహం త‌ర్వాత సెల‌క్టివ్ గా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Sep 2024 6:48 AM GMT
సెకెండ్ ఇన్నింగ్స్ లో చంద‌మామ‌కి బంప‌ర్ ఆఫ‌ర్!
X

చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ వివాహం త‌ర్వాత సెల‌క్టివ్ గా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్ పాత్ర‌ల‌కు పూర్తి దూరంగా జ‌రిగింది. మెచ్యూర్డ్ పాత్ర‌ల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంది. దీనిలో భాగంగా లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్ని టార్గెట్ గా పెట్టుకుంది. అలాగ‌ని హీరోయిన్ పాత్ర‌ల‌కు దూర‌మైంద‌ని కాదు. సినిమ‌లో త‌న పాత్ర ప్రాధాన్య‌త‌.....ఆ పాత్ర విధానాన్ని బ‌ట్టి క‌మిట్ అవుతుంది.

కీల‌క పాత్ర‌ల‌కు సైతం సై అంటోంది. స్టార్ హీరోల చిత్రాల్లో కాసేపు క‌నిపించినా? ఓ కిక్ అంటూ వాటిని విడిచి పెట్ట‌డం లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా అమ్మ‌డు స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తోన్న `సికంద‌ర్` చిత్రంలో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో కాజ‌ల్ మ‌రో హీరోయిన్ గా న‌టిస్తుందా? కీల‌క పాత్ర పోషిస్తుందా? గెస్ట్ అపిరియ‌న్స్ ఇస్తుందా? అన్న‌ది క్లారిటీ లేదు కానీ ప్రాజెక్ట్ కి మాత్రం క‌మిట్ అయిన‌ట్లు వినిపిస్తుంది.

ఇప్ప‌టికే స‌ల్మాన్ ఖాన్ కి జోడీగా ర‌ష్మిక మంద‌న్నా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సువ్య‌త్యాసం ఉన్నా స‌ల్మాన్ తో ఎలాంటి స‌న్నివేశాలు చేయ‌డానికైనా రెడీ అంటూ దూసుకెళ్తోంది. ఈ నేప‌థ్యంలో కాజ‌ల్ పేరు తెర‌పైకి రావ‌డం ఇంట్రెస్టింగ్. ఇప్ప‌టికే ఈ సినిమా మూడు మేజర్ షెడ్యూల్స్

పూర్తి చేసుకుంది. స‌ల్మాన్ స‌హా కీల‌క న‌టులంతా ఇందులో పాల్గొన్నారు.

భారీ యాక్ష‌న్ ఎంట‌న్ టైన‌ర్ గా మురగ‌దాస్ మ‌లుస్తున్నారు. ద‌ర్బార్ త‌ర్వాత ముర‌గ‌దాస్ ద‌ర్శ‌కత్వానికి దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. చాలా స‌మ‌యం తీసుకుని సికంద‌ర్ స్టోరీ రాసుకున్నారు. స‌ల్మాన్ భాయ్ ఎంతో ఇష్ట‌ప‌డి చేస్తోన్న చిత్ర‌మిది. సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. తమిళ నటుడు సత్యరాజ్ మ‌రో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రతీక్ పాటిల్ బబ్బర్ ప్రధాన ప్రతినాయకుడు. సాజిద్ నడియాడ్‌వాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2025 ఈద్‌కి విడుదల కానుంది.