చందమామ ఫ్యామిలీతో సూర్య.. క్యూట్ ఫొటో
పీరియాడికల్ యాక్షన్ మూవీగా కంగువాను సిరుత్తై శివ తెరకెక్కించారు.
By: Tupaki Desk | 19 Oct 2024 4:44 PM GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పీరియాడికల్ యాక్షన్ మూవీగా కంగువాను సిరుత్తై శివ తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ, స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ముఖ్యపాత్రల్లో నటించగా.. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. రూ.400 కోట్లకుపైగా వ్యయంతో రూపొందించారట.
సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా కంగువా తెరకెక్కినట్లు సమాచారం. అయితే సినిమాను నవంబరు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని కొద్ది రోజుల క్రితం మేకర్స్ ప్రకటించారు. ఇటీవల ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. కంగువా ప్రీరిలీజ్ ఈవెంట్లను భారీ ఎత్తున నిర్వహించేలా మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ.. మూడు భాషల్లో కూడా వేడుకలు జరపనున్నారని సమాచారం.
ప్రస్తుతం ప్రెస్ మీట్స్ అండ్ ఇంటర్వ్యూలతో మూవీ టీమ్ బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో సినిమా ప్రమోట్ చేస్తోంది. హీరో సూర్య కూడా హుషారుగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. రీసెంట్ గానే ముంబై వెళ్లారు. అదే సమయంలో నేడు ముంబై ఎయిర్ పోర్ట్ లో టాలీవుడ్ చందమామ కాజల్, సూర్య కలుసుకున్నారు. కాజల్ తన ఫ్యామిలీతో ఎక్కడికో వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. అప్పుడు సూర్యను చూసి వెంటనే దగ్గరకు వెళ్లారు.
ఎలా ఉన్నారని సూర్యను కాజల్ అడిగారు. అనంతరం తన కొడుకు నీల్ ను పరిచయం చేశారు. ఆ తర్వాత తన భర్త గౌతమ్ కిచ్లూను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న.. సూర్య, గౌతమ్ కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం అంతా కలిపి ఫోటోలు దిగారు. అందుకు సంబంధించిన పిక్స్ అండ్ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. గుడ్ మామొంట్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అయితే సూర్య, కాజల్.. ఓసారి స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. కేవీ ఆనంద్ దర్శకత్వం వహించిన మాత్రాన్ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. తెలుగులో బ్రదర్స్ పేరుతో ఆ మూవీ రిలీజ్ అయింది. ప్రస్తుతం కాజల్.. సికిందర్, ఉమ చిత్రాల్లో నటిస్తున్నారు. కన్నప్పలో క్యామియో రోల్ పోషిస్తున్నారు. సూర్య.. కంగువాతోపాటు కార్తీక్ సుబ్బరాజ్ తో సినిమా చేస్తున్నారు. త్వరలో ఆర్జే బాలాజీ మూవీని కూడా స్టార్ట్ చేయనున్నారు.