Begin typing your search above and press return to search.

కాజల్ ఇక స్టార్స్ తో కష్టమేనా..?

ఒకప్పుడు టాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన కాజల్ పెళ్లి తర్వాత తన ఫాం పూర్తిగా కోల్పోయిందని చెప్పొచ్చు

By:  Tupaki Desk   |   10 Aug 2023 4:30 PM GMT
కాజల్ ఇక స్టార్స్ తో కష్టమేనా..?
X

ఒకప్పుడు టాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన కాజల్ పెళ్లి తర్వాత తన ఫాం పూర్తిగా కోల్పోయిందని చెప్పొచ్చు. కంప్లీట్ ఫ్యామిలీ ఉమెన్ గా మారిన కాజల్ భర్త తన బాబుతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. అయితే తను చేయాలని అనుకోకపోయినా ఆఫర్లు వరుసగా వస్తుండటంతో సినిమాలు చేయక తప్పట్లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ తన పంథా మార్చి ఫిమేల్ సెంట్రిక్ సినిమాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది కాజల్. అలా చేయడం వల్ల కెరీర్ మళ్లీ గ్రోత్ అవుతుందని భావిస్తుంది.

ప్రస్తుతం కాజల్ తెలుగులో సత్యభామ సినిమా చేస్తుంది. ఇదివరకు ఎప్పుడూ కూడా చూడని విధంగా కాజల్ తన డేరింగ్ అండ్ డాషింగ్ లుక్ తో కనిపిస్తుంది. రీసెంట్ గా వచ్చిన టీజర్ తోనే సత్యభామ రేంజ్ ఏంటన్నది చూపించింది. ఇక మరోపక్క కాజల్ ఒకటి రెండు స్టార్ అవకాశాలు వస్తున్నా కాదనేస్తుందని తెలుస్తుంది. అదేంటి కాజల్ అలా ఎందుకు చేస్తుంది అంటే కమర్షియల్ సినిమా అంటే మళ్లీ ఇదివరకులా గ్లామర్ షో చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం కాజల్ కి స్కిన్ షో చేయాలన్న ఆలోచన లేదని తెలుస్తుంది.

అందుకే రీసెంట్ గా ఒకటి రెండు అవకాశాలు వచ్చినా వాటిని తిరస్కరించిందని తెలుస్తుంది. ఇలా చేస్తే కాజల్ కి స్టార్ అవకాశాలు రావడం కష్టమే అని చెప్పొచ్చు. అయితే కెరీర్ లో ఇప్పటివరకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయని కాజల్ ఒక్కసారిగా అలాంటి సినిమాలే చేస్తా అని చెబుతుంది. కాజల్ మరో నయనతారలా అవ్వాలనుకుంటుందని తెలుస్తుంది. బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో కూడా నటిస్తున్న కాజల్ సీనియర్ స్టార్స్ అయినా సరే జత కట్టేందుకు సైన్ అనేస్తుంది.

ఒకవేళ తను చేసే ఈ సినిమాల ఫలితాలు బాగుంటే ఓకే లేదంటే మాత్రం కాజల్ కెరీర్ మళ్లీ రిస్క్ లో పడే ఛాన్స్ ఉంటుంది. ఏదో తనకు వచ్చిన అర కొర అవకాశాలు చేసుకుంటూ వెళ్తా అంటే ఓకే కానీ తను స్టార్ రేసులో ఉండాలంటే మాత్రం కాజల్ మళ్లీ ఇదివరకులా కనిపించాల్సిందే. ఈ టైం లో కాల చేసే సినిమాలు ఎంపిక చేసుకునే కథలను బట్టే తన నెక్స్ట్ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. ఏది ఏమైనా టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి స్టార్ క్రేజ్ తెచ్చుకున్న కాజల్ ప్రస్తుతం కెరీర్ లో ఎదుర్కొంటున్న ఈ సమస్యలను అధిగమించాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. ఆమె సరైన సినిమాతో వస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు తెలుగు ఆడియన్స్.