Begin typing your search above and press return to search.

కాజల్ కి కెవ్వు కేక ఛాన్స్..!

టాలీవుడ్ లో దాదాపు స్టార్స్ అందరితో జత కట్టిన అమ్మడు ఇప్పుడు సీనియర్ హీరోలతో కూడా జోడీ కట్టేందుకు ఓకే చెబుతుంది

By:  Tupaki Desk   |   11 Aug 2023 9:38 AM GMT
కాజల్ కి కెవ్వు కేక ఛాన్స్..!
X

సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ ఖాతాలో మరో లక్కీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. టాలీవుడ్ లో దాదాపు స్టార్స్ అందరితో జత కట్టిన అమ్మడు ఇప్పుడు సీనియర్ హీరోలతో కూడా జోడీ కట్టేందుకు ఓకే చెబుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది అనుకుంటా అందుకే కాజల్ ఓ పక్క బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమా సత్యభామకు సైన్ చేసింది. ఈ రెండు సినిమాలతో మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది కాజల్.

ఇదిలా ఉంటే లేటెస్ట్ గా అమ్మడికి కింగ్ నాగార్జున మూవీ ఆఫర్ వచ్చింది. నాగార్జున హీరోగా మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ పొరింజు మరియం జోస్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బన్నీ ఈ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మధ్య సీనియర్ స్టార్స్ అంతా కూడా ఇతర భాషల్లో మంచి కథలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున కూడా పొరింజు మరియం జోస్ సినిమా చూసి తెలుగు రీమేక్ కి ఓకే చెప్పారట. ఈ సినిమాను మలయాళంలో జోషి డైరెక్ట్ చేయగా తెలుగులో విజయ్ బన్నీ దర్శకత్వం వహించనున్నారు.

సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా నాగార్జున సరసన కాజల్ ని ఫిక్స్ చేశారు. పెళ్లై ఒక బాబుకి జన్మనిచ్చిన తర్వాత కూడా సినిమాల్లో రాణించాలని చూస్తుంది కాజల్. ఆఫ్టర్ మ్యారేజ్ తన లుక్ విషయంలో కొద్దిపాటి మార్పులు వచ్చినా ఆమెకున్న ఎగ్జిస్టింగ్ ఇమేజ్ వల్ల అవకాశాలు వస్తున్నాయి. రాబోతున్న భగవంత్ కేసరి క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని తెలుస్తుంది.

నాగార్జున సినిమా కూడా ఆమె టాలీవుడ్ కెరీర్ కి మరింత బూస్టింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ నాగ చైతన్య సరసన నటించిన కాజల్ ఇప్పుడు నాగార్జున తో జత కడుతుంది. ఇదివరకు చాలా సినిమాల్లో కాజల్ తో నాగార్జున జత కట్టాల్సి ఉన్నా కుదరలేదు. ఫైనల్ గా ఈ మలయాళ రీమేక్ తో అది కుదురుతుంది. కాజల్ కూడా ఇక మీదట సినిమాల విషయంలో మరింత జాగ్రత్త వహించాలని అనుకుంటుంది. ముఖ్యంగా కంటెంట్ బలంగా ఉన్న సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తుంది కాజల్. చూస్తుంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కాజల్ మరో దశాబ్దం పాటు కెరీర్ ఫాం కొనసాగించేలా ఉంది.