Begin typing your search above and press return to search.

బాడీ హ‌గ్గింగ్ డ్రెస్‌లో చంద‌మామ లుక్

ఫోటోషూట్ల‌లోను రెచ్చిపోతున్నారు. ఇన్ స్టా ఆదాయం కోసం ఇదొక ప్ర‌య‌త్నం కావొచ్చు. కానీ కాజ‌ల్ అందుకు పూర్తి విరుద్ధం.

By:  Tupaki Desk   |   11 May 2024 3:43 AM GMT
బాడీ హ‌గ్గింగ్ డ్రెస్‌లో చంద‌మామ లుక్
X

మోడ్ర‌న్ డే భామ‌లు ఫోటోషూట్ ట్రెండ్స్ అమాంతం మారాయి. హాలీవుడ్ స్టార్ల‌కు ధీటుగా ఇప్పుడు భార‌త‌దేశంలోని చాలా మంది యూట్యూబ్ స్టార్లు, సాధార‌ణ యువ‌తులు కూడా అసాధార‌ణ ఫోటోషూట్ల‌తో చెల‌రేగుతున్నారు. ఇన్ స్టా మాధ్య‌మంలో ఈ ఫోటోషూట్ల వీడియోల‌కు బోలెడంత గిరాకీ ఉంది. అయితే ప్ర‌పంచం ఎంత దూరం వెళ్లినా న‌టీమ‌ణుల్లో కొంద‌రు హ‌ద్దు మీర‌కుండా ప‌ద్ధ‌తిగా ఉన్నారు. గ్లామ‌ర్ ని ప‌రిమితుల్లో ఒలికించే బ్యూటీగా చంద‌మామ కాజ‌ల్ అంద‌రికీ సుప‌రిచితం. పెళ్లి త‌ర్వాతా చాలా మంది న‌టీమ‌ణులు ఆన్ స్క్రీన్ చెల‌రేగి గ్లామ‌ర్ ని ఒల‌క‌బోస్తున్నారు. ఫోటోషూట్ల‌లోను రెచ్చిపోతున్నారు. ఇన్ స్టా ఆదాయం కోసం ఇదొక ప్ర‌య‌త్నం కావొచ్చు. కానీ కాజ‌ల్ అందుకు పూర్తి విరుద్ధం.

తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ బాడీ హ‌గ్గింగ్ లుక్ ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. నేవీ బ్లూ డిజైన‌ర్ డ్రెస్ లో కాజ‌ల్ భంగిమ యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ లుక్ లో కాజ‌ల్ స్లిమ్ గా క‌నిపిస్తోంది. ''చ‌క్క‌న‌మ్మ చిక్కినా అంద‌మే. పెళ్లి త‌ర్వాతా ఇంకా స్లిమ్ అవుతోంది. హ‌ద్దు మీర‌కుండానే ఎంతో ఒద్దిక‌గా ఫోటోషూట్ల‌తో ఆక‌ర్షిస్తోంది'' అంటూ అభిమానులు కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. కాజ‌ల్, అనుష్క‌, త‌మ‌న్నా లాంటి భామ‌లు ఇటీవ‌ల విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ క్రూ (హిందీ) త‌ర‌హా చిత్రాల్లో న‌టించాల‌ని ప‌లువురు అభిమానులు కోరుకుంటున్నారు.

టాలీవుడ్‌కి దూరం కాలేదు:

తెలుగు చిత్ర‌సీమ‌తో కాజ‌ల్ కిచ్లు అనుబంధం ఎంతో గొప్ప‌ది. అందుకే కాజల్ ఇప్ప‌టికీ ఇక్క‌డ మీడియాకి ట‌చ్ లో ఉంది. అంతేకాదు.. తన కెరీర్ ఆరంభం నుంచి అనుభ‌వ‌జ్ఞుడైన టాలీవుడ్ స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ గా సుప‌రిచితుడైన శివ మ‌ల్ల‌ల నిర్మాత‌గా మారి తెలుగు వారికి అందించిన‌ న‌వ‌త‌రం ప్రేమ‌క‌థా చిత్రం 'స‌త్య‌'కి త‌న‌వంతు ప్ర‌చార‌ సాయం అందించారు కాజ‌ల్‌. ఇటీవ‌ల‌ 'స‌త్య' మూవీ నుంచి 'నిజ‌మా ప్రాణ‌మా' లిరిక‌ల్ వీడియోను కాజల్ లాంచ్ చేసారు. సత్యలోని టీజర్, ట్రైలర్, పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన ల‌భించింది. ఈ శుక్ర‌వారం విడుద‌లైన స‌త్య చిత్రానికి డీసెంట్ క‌లెక్ష‌న్స్ ఉన్నాయని శివ మ‌ల్ల‌ల అన్నారు. కాజ‌ల్ ప్ర‌చార సాయానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. శివ మల్లాల కాజల్ అగర్వాల్‌తో తన తొలి చిత్రం 'లక్ష్మీ కళ్యాణం' నుండి తన అనుబంధాన్ని ప్రస్తావించారు.