Begin typing your search above and press return to search.

శ్రీలీల గురించి చందమామ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి సినిమా ను అక్టోబర్‌ 19న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు

By:  Tupaki Desk   |   12 Oct 2023 11:55 AM GMT
శ్రీలీల గురించి చందమామ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
X

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి సినిమా ను అక్టోబర్‌ 19న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌ హీరోయిన్ గా నటించింది. కీలక పాత్రలో శ్రీలీల నటించడం జరిగింది. బాలయ్య, శ్రీలీల కాంబో సన్నివేశాలు సినిమా కు ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.

సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో యూనిట్‌ సభ్యులు వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలివిగా కష్టపడుతున్న శ్రీలీల కి మంచి భవిష్యత్తు ఉంది అంటూ కాజల్ అగర్వాల్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది.

కాజల్ ఆ ఇంటర్వ్యూలో ఇంకా మాట్లాడుతూ... సినిమాల్లో నటిస్తున్న సమయంలో నటిగా ఎదగడంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఉన్నతంగా ఎదగాల్సిన అవసరం ఉంటుంది. నా మొదటి ప్రాముఖ్యత సినిమాలు.. అయినా కూడా ఇతర విషయాలకు నేను సాధ్యం అయినంత ఎక్కువ సమయం ను కేటాయిస్తాను అంటూ కాజల్ అగర్వాల్‌ పేర్కొంది.

ఏదైనా పనిని ఛాలెంజ్ గా తీసుకుంటే కచ్చితంగా దాన్ని సాధిస్తాం. శ్రీలీల లో ఆ క్వాలిటీని నేను చేశాను. తాను ఏదైనా కోరుకుంటే సాధించి తీరుతుంది. చాలా తెలివైనది, అలాగే చాలా కష్టపడే మనస్తత్వం. ప్రతి ఒక్కరితో కూడా చాలా విధేయంగా ఉంటూ అందరి హృదయాలను గెలుచుకుంటూ ఉంది. చాలా ప్లానింగ్ తో శ్రీలీల కనిపిస్తూ ఉంటుంది.

శ్రీలీల సెట్‌ లో ఉంటే చాలా సరదాగా ఉంటుంది. తనతో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. అందరితో కలిసి పోవడం అనేది ఈతరం హీరోయిన్స్ ఎక్కువగా నేర్చుకోవాల్సిన విషయం అన్నట్లుగా కాజల్‌ చెప్పుకొచ్చింది. మొత్తానికి శ్రీలీల పై ఇంతకు ముందు బాలయ్య ప్రశంసల వర్షం కురిపిస్తే ఇప్పుడు కాజల్‌ వంతు అయింది.

ఒక వైపు కమర్షియల్‌ హీరోయిన్ గా యంగ్‌ స్టార్‌ హీరోలకు జోడీగా నటిస్తున్న శ్రీలీల మరో వైపు ఇలా ముఖ్య పాత్రల్లో నటించేందుకు ఓకే చెప్పడం నిజంగా గొప్ప విషయం. సినిమాల ఎంపిక విషయం లో కాజల్‌ చెప్పినట్లుగా చాలా తెలివిగా వ్యవహరిస్తుంది కనుకే మొదటి సినిమా పెళ్లి సందడి ఫెయిల్‌ అయినా కూడా ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది అనడంలో సందేహం లేదు.