Begin typing your search above and press return to search.

కాజ‌ల్ మాత్ర‌మే టార్గెట్...ఏం పాంపం!

మెగాస్టార్ చిరంజీవి, విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ లాంటి స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌నిచేయాలంటే హీరోయిన్లు అయితే స‌రిపోదు

By:  Tupaki Desk   |   9 July 2024 5:45 AM GMT
కాజ‌ల్ మాత్ర‌మే టార్గెట్...ఏం పాంపం!
X

మెగాస్టార్ చిరంజీవి, విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ లాంటి స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌నిచేయాలంటే హీరోయిన్లు అయితే స‌రిపోదు. వాళ్ల‌కి అదృష్టం కూడా క‌లిసిరావాలి. అప్పుడే వాళ్ల‌తో న‌టించే ఛాన్స్. కానీ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ విష‌యంలో మాత్రం అదృష్టం ఒక్కటే కాదు. అంత‌కు మించి లక్ ఉంటే త‌ప్ప ప‌న‌య్యేలా లేదు. అవును ఈ హీరోలిద్ద‌రి విష‌యంలో కాజ‌ల్ కి చేదు అనుభ‌వ‌మే ఎదురైంది. అనుభ‌వం అనేకంటే చిన్న‌పాటి అవ‌మానంగానేని దీన్ని భావించాలని నెగిటివ్ సెన్స్ సైతం తెర‌పైకి వ‌స్తోంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఆచార్య` సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ఆమెపై షూటింగ్ కూడా చేసారు. చిరుకి మెయిన్ లీడ్ ఆమె కావ‌డంతో చాలా రోజులు షూట్ లో పాల్గొంది. కానీ రిలీజ్ అయ్యే స‌రికి తెర‌పై కాజ‌ల్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఇదేంటి కాజ‌ల్ లేద‌ని అభిమానులంతా సందేహప‌డ్డారు. కానీ ఆమె పోర్ష‌న్ ని చివ‌రి నిమిష‌యంలో తొల‌గించాల్పి వ‌చ్చింది. సినిమా లెంగ్త్ పెరిగిపోవ‌డం స‌హా ఆమె పాత్ర అంత కీల‌కం కాక‌పోవ‌డంతో ఆమె పోర్ష‌న్ మొత్తాన్ని తొల‌గించారు.

ఇదే ర‌క‌మైన అనుభ‌వం `భార‌తీయుడు-2`లోనూ ఫేస్ చేస్తోంది. ఈ సినిమాలో కాజ‌ల్ తో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా మెయిన్ లీడ్ కి ఎంపిక‌య్యారు. కాజ‌ల్ పై షూటింగ్ కూడా చేసారు. క‌మ‌ల్ స‌ర‌స‌న కాజ‌ల్ ని చూడొచ్చ‌ని అభిమానులు ఆశ‌ప‌డ్డారు. కానీ నిరాశే ఎదుర‌వుతుంది. ఆమె పాత్ర‌ని రెండవ భాగం నుంచి భార‌తీయుడు మూడ‌వ భాగానికి త‌ర‌లించారు.రెండవ భాగంలో కాజ‌ల్ పాత్ర అవ‌స‌రం లేద‌ని భావించి శంక‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. కానీ ఆమె స‌హ‌న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ పాత్ర మాత్రం ఉంటుంది.

దీంతో మ‌రోసారి కాజ‌ల్ కి చేదు అనుభ‌వం తప్ప‌లేదు. అభిమానుల‌కు నిరాశ త‌ప్ప‌లేదు. ఎందుకిలా జ‌రిగింది అంటే కాజ‌ల్ వ‌ద్ద కూడా స‌రైన స‌మాధానం లేదు. ఈ విష‌యంలో అమ్మ‌డు సైతం అసంతృప్తిగా ఉంద‌ని ఆమె మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తుంది. ఒకేసారి ఇలా అగ్ర హీరోల చిత్రాల నుంచి ఇలాంటి అనుభ‌వం ఎదుర‌య్యే స‌రికి అభిమానులు నిరాశ‌లో కూరుకుపోతున్నారు.