సెట్లో ఉండగా చందమామ కాజల్ డిప్రెషన్?
అందాల చందమామ కాజల్ అగర్వాల్ 2020లో గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని 2022లో తన కొడుకు నీల్‌ను స్వాగతించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 May 2024 5:32 AMఅందాల చందమామ కాజల్ అగర్వాల్ 2020లో గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని 2022లో తన కొడుకు నీల్‌ను స్వాగతించిన సంగతి తెలిసిందే. అయితే వారసుని జననం తర్వాత వృత్తి పరంగా సవాళ్లను ఎదుర్కోవడం గురించి ఇటీవల కాజల్ ఓపెనైంది. ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో కాజల్ మాతృత్వం అనంతరం కెరీర్‌ను కొనసాగించడం ఎలాంటి సవాల్ గా ఉంటుందో.. తన అనుభవాలను తెలిపింది. ప్రసవానంతరం కేవలం రెండు నెలల్లోనే విధి నిర్వహణలోకి వెళ్లానని చెప్పిన కాజల్.. తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి వెల్లడించింది. ముఖ్యంగా కమల్ హాసన్‌తో కలిసి నటించిన భారతీయుడు 2 (ఇండియన్ 2) చిత్రీకరణ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించింది.
ఇండియన్ 2 కోసం ప్రసవానంతరం కేవలం రెండు నెలల్లోనే షూటింగుకు వెళ్లాను. నేను గుర్రపు స్వారీ చేస్తూ కలరిప్పాయట్టు ప్రయత్నించాను. అది విపరీతమైన బాధాకరమైన సన్నివేశం. శంకర్ సర్ చాలా అర్థం చేసుకుని, నా షెడ్యూల్‌ని సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు. కాని నేను సినిమాను పూర్తి చేయాల్సి వచ్చింది. ఇది నా జీవితంలో నేను చేసిన కష్టతరమైన పని. తిరుపతి దగ్గర షూట్ చేసినప్పుడు నేను నా బిడ్డను వెంట తీసుకెళ్లాను. ఎందుకంటే నేను అతడికి ఆహారం ఇవ్వాలి. నేను షాట్ల మధ్య చిన్నారి కోసం గదికి పాలు పంపాను`` అని చెప్పింది.
ప్రస్తుతం తన చిత్రం సత్యభామ ప్రమోషన్‌లో కనిపించిన కాజల్ తాను పనిలోకి తిరిగి వచ్చినప్పుడు కుమారుని నుంచి విడిపోవడంపై ఆందోళన చెందుతానని, `మామ్ గిల్ట్`తో బాధపడ్డానని చెప్పింది. తన ఆందోళన ప్రతికూల భావోద్వేగాలను ఎదుర్కోవటానికి చికిత్స తీసుకున్నానని వెల్లడించింది.
అలాంటి సమయంలో అసురక్షితంగా ఉన్నామని భయానికి గురవుతారు. ఆ సమయంలో బాధను రెట్టింపు అనుభవిస్తుంది ఏ మమ్మీ అయినా. నేను దానిని ఎదుర్కోవటానికి థెరపీని తీసుకున్నాను. దీనికోసం యాంటీ-డిప్రెసెంట్స్ తీసుకున్నాను. పెళ్లయ్యాక పెద్దగా ఏమీ మారలేదు కానీ మాతృత్వం నన్ను వ్యక్తిగా మార్చేసింది. బిడ్డను కనడం సవాలుతో కూడుకున్నది. కష్టాలు ఉన్నప్పటికీ.. తన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడంలో తన నిబద్ధత గురించి కాజల్ నొక్కి చెప్పింది. నేను ఎంత బిజీగా ఉన్నా నా భర్త (గౌతమ్) ఎల్లప్పుడూ నన్ను చేరుకునేవారు. మేం మొదటి రోజు నుండి దానిని కొనసాగించాము... అని తెలిపారు.
గర్భధారణ సమయంలో విరామం తీసుకోవడం గురించి మాట్లాడుతూ కాజల్ తన మొదటి త్రైమాసికంలో మాత్రమే విశ్రాంతిగా ఉన్నానని తెలిపారు. 16 సంవత్సరాల వయస్సు నుండి పని చేస్తున్నందున ఖాళీగా కూర్చోవడం కష్టమని వెంటనే గ్రహించినట్టు కాజల్ చెప్పింది. ప్రసవించిన కొద్ది రోజులకే తాను ఓ యాడ్ కోసం షూటింగులో పాల్గొన్నానని కూడా పేర్కొంది. పెళ్లయిన నటీమణులపై సినీరంగంలో పక్షపాతం ఉంటుందా? అని ప్రశ్నించగా.. ఈ పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయని కూడా కాజల్ పేర్కొంది.
ఇండియన్ 2 చిత్రం జూలై 12న విడుదలకు సిద్ధమవుతోంది. అభిమానులు తమ అభిమాన తార కాజల్‌ను తిరిగి తెరపై పూర్తి స్థాయి పాత్రలో చూసే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం రకరకాల కారణాలతో ఆలస్యమైంది. ఆన్-సెట్ ప్రమాదం, కోవిడ్-19 మహమ్మారి .. రిలీజ్ వాయిదాల కారణంగా చాలా ఆలస్యమైంది. 1996 బ్లాక్‌బస్టర్ భారతీయుడుకి ఇది సీక్వెల్ సినిమాగా రానుంది.