Begin typing your search above and press return to search.

కాజల్ కు ఇదే బెస్ట్ ఛాన్స్!

ఇప్పుడు ఈ రెండు సినిమాలపై కాజల్ మంచి హోప్స్ పెట్టుకుంది. వరుస సినిమాలతో బిజీగా అవ్వడానికి బెస్ట్ ఛాన్స్ ఇదేనని భావిస్తోంది.

By:  Tupaki Desk   |   31 May 2024 1:30 PM GMT
కాజల్ కు ఇదే బెస్ట్ ఛాన్స్!
X

కలువ కళ్ళు.. వైట్ స్కిన్ టోన్.. మెస్మరైజ్ చేసే నవ్వు.. ఇవన్నీ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సొంతం. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన కాజల్ ఇప్పుడు.. ఓవైపు సినిమాలు.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తోంది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయిన కాజల్.. చందమామ మూవీతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. టాలీవుడ్ చందమామగా మారిపోయింది.

ఆ తర్వాత పలు సినిమాల్లో కాజల్ యాక్ట్ చేసినా.. పెద్దగా వర్కౌట్ కాలేదు. అదే సమయంలో మగధీర మూవీ ఆమె కెరీర్ ను మార్చేసింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కాజల్ అగర్వాల్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ లు అందుకుంది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కాజల్ ఎదిగిపోయింది.

రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ, మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్స్ తో జత కట్టి సౌత్ లో కొన్నేళ్ల పాటు తన హవా కొనసాగించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా సత్తా చాటింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు బిజినెస్ మ్యాన్, తన చిన్నప్పటి ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత కొన్ని నెలలపాటు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది కాజల్.

ఇక పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతుందేమో అనుకుంటే.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చి దుమ్మురేపుతోంది. మెల్లగా బిజీ అవుతోంది. గతేడాది బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీలో యాక్ట్ చేసింది. కానీ తన రోల్ కు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు ఆమె నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆమె ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ మూవీ సత్యభామ.. జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కాజల్ నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక జులై 12వ తేదీన విడుదల కానున్న కమల్ హాసన్ ఇండియన్-2లో కూడా కాజల్ నటించింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలపై కాజల్ మంచి హోప్స్ పెట్టుకుంది. వరుస సినిమాలతో బిజీగా అవ్వడానికి బెస్ట్ ఛాన్స్ ఇదేనని భావిస్తోంది. మరి ఈ రెండు సినిమాలు కాజల్ కు ఎలాంటి హిట్లు ఇస్తాయో వేచి చూడాలి.