నేను బాగా ఏడిస్తే ఆ ఛాన్స్ వచ్చింది : కాజల్
లేడీ ఓరియంటెడ్ సినిమాగా రూపొందిన సత్యభామ ప్రమోషన్ లో కాజల్ పాల్గొంటుంది.
By: Tupaki Desk | 9 May 2024 6:28 AM GMTపెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. తల్లి అయిన తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఈ అమ్మడు ఓకే చెబుతోంది. తాజాగా ఈ అమ్మడు నటించిన సత్యభామ విడుదల అవ్వబోతుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాగా రూపొందిన సత్యభామ ప్రమోషన్ లో కాజల్ పాల్గొంటుంది.
సత్యభామ ప్రమోషన్ లో భాగంగా అలీతో సరదాగా ప్రోగ్రాంకి హాజరు అయ్యింది. ఆ సందర్భంగా అలీ తో కాజల్ పలు విషయాల గురించి మాట్లాడింది. ముఖ్యంగా తన మొదటి సినిమా ఆఫర్ మరియు ఆ సమయంలో తాను చేసిన ఆడిషన్స్ గురించి కాజల్ అగర్వాల్ సరదా విషయాన్ని చెప్పుకొచ్చింది.
తేజ దర్శకత్వంలో లక్ష్మి కళ్యాణం సినిమాలో ఎలా ఛాన్స్ వచ్చింది అంటూ అలీ ప్రశ్నించిన సమయంలో కాజల్ సమాధానమిస్తూ... తేజ గారు నా ఫోటో చూసి ఆడిషన్స్ కి పిలిచారు. ఆడిషన్స్ లో నన్ను ఏం అడుగుతారా అని నేను ఎదురు చూశాను. ఆ సమయంలో నన్ను ఏడవమని చెప్పాను. రీజన్ లేకుండా, ఏడ్చే ఫీలింగ్ లేకుండా ఎలా ఏడవడం అనుకున్నాను.
అప్పుడు మా నాన్న నా వద్దకు వచ్చి నేను ఏడ్చే ఒక విషయాన్ని చెప్పారు. అప్పుడు నాకు ఏడుపు వచ్చింది. నేను బాగా ఏడ్చాను అని తేజ గారు లక్ష్మి కళ్యాణం సినిమాలో ఛాన్స్ ఇచ్చారంటూ కాజల్ సరదాగా చెప్పుకొచ్చింది. హీరోయిన్ లను తేజ గారు ఎంపిక చేసే విధానం చాలా విభిన్నంగా ఉంటుందని కాజల్ పేర్కొంది.
గత ఏడాది భగవంత్ కేసరి సినిమాతో హిట్ కొట్టిన కాజల్ అగర్వాల్ మరో విజయాన్ని సత్యభామ సినిమాతో దక్కించుకోబోతున్నట్లుగా నమ్మకంగా ఉంది. ఈ సినిమా హిట్ అయితే ముందు ముందు కాజల్ నుంచి వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.