ఆ ముగ్గురి గురించి చందమామ ఏమందటే?
మరోవైపు లేడీ ఓరియేంటెడ్ నాయికగానూ సత్తా చాటడానికి సీరియస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే `సత్యభామ` అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 May 2024 5:30 PM GMTచందమామ కాజల్ అగర్వాల్ సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోలకు పర్పెక్ట్ ఛాయిస్ కావడంతో అవకాశాలు అమ్మడికి బాగానే వరిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. నవ నాయికలాగే అవకాశాలు అందుకుంటుంది. మరోవైపు లేడీ ఓరియేంటెడ్ నాయికగానూ సత్తా చాటడానికి సీరియస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే `సత్యభామ` అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.
మరికొన్ని కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా అమ్మడి కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతుంది. ఈనేపథ్యంలో తాజాగా ఓఇంటర్వ్యూలో ముగ్గురు స్టార్ డైరెక్టర్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అవేంటో ఆమె మాటల్లోనే..`లక్ష్మీ కల్యాణం` సినిమాతో నన్ను తేజ గారు పరిచయం చేశారు. ఆ తరువాత `నేనేరాజు నేనే మంత్రి` , `సీత` సినిమాలు చేశాను. డైరెక్టర్ గా తేజ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. మిగిలిన దర్శకులతో పోలిస్తే మేకింగ్ లా చాలా విషయాలు కొత్తగా అనిపిస్తాయి.
పర్పెక్షన్ కోసం ఎక్కువగా వర్క్ చేస్తుంటారు. అది నాకు ఆయనలో బాగా నచ్చుతుంది. అలాగే రాజమౌళి తో మగధీర చేసాను. ఆయనది మరో ప్రత్యేకమైన శైలి. ఆయనతో పనిచేయడం కష్టంగానూ అనిపించింది. బహుశా కథ వల్లే అలా అనిపించింది. అందుకే అందులో నా పాత్ర ఎంతో గొప్పగా పండింది. సినిమా గొప్ప విజయం సాధించింది. నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అందుకు మగధీరనే కారణం. కృష్ణవంశీగారితో పనిచేసినప్పుడు అలాగే అనిపించింది. ఆయన సినిమాలో పాత్రలు ఎంతో అందంగా కనిపిస్తాయి.
అదంతా ఆయన క్రియేటివిటీనే. ఎమోషనల్ గానూ గొప్పగా కనెక్ట్ చేస్తారు. అలాంటి దర్శకులతో కలిసి పనిచేసే అవకాశం రావడం . ఒక్కొక్కరిది ఒక్కో రకమైన పద్ధతి. ఈ ముగ్గురి నుంచి కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇంతవరకూ తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో కలుపుకుని 65 సినిమాలు చేశాను. పేక్షకుల అభిమానం వల్లనే ఇంత జర్నీ సాధ్యమైంది` అని అన్నారు.