Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : చూపు తిప్పనివ్వని అందాల చందమామ

ఆ మధ్య పెళ్లి మరియు బిడ్డకు జన్మనివ్వడం వల్ల కాస్త గ్యాప్ తీసుకున్న కాజల్ అగర్వాల్‌ మళ్లీ బిజీ అయ్యింది.

By:  Tupaki Desk   |   11 July 2024 1:30 PM GMT
పిక్ టాక్‌ : చూపు తిప్పనివ్వని అందాల చందమామ
X

టాలీవుడ్‌ ప్రేక్షకులకు అందాల చందమామగా సుపరిచితురాలు అయిన కాజల్ అగర్వాల్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అవుతున్నా కూడా ఇంకా కూడా బిజీ బిజీగా సినిమాలు చేస్తూనే ఉంది. ఆ మధ్య పెళ్లి మరియు బిడ్డకు జన్మనివ్వడం వల్ల కాస్త గ్యాప్ తీసుకున్న కాజల్ అగర్వాల్‌ మళ్లీ బిజీ అయ్యింది.

ఇటీవలే పవర్ ఫుల్‌ పాత్ర సత్యభామ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలు ఎంపిక చేసుకుంటూ మరికొన్ని లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో రెడీ అవుతోంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ కాజల్‌ అగర్వాల్‌ సొంతం అంటూ ఫ్యాన్స్ అంటూ ఉంటారు.

తాజాగా ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు ఆ విషయానికి ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా నిలుస్తున్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా ముద్దుగుమ్మలు నడుము అందం చూపించడం లేదంటే స్కిన్‌ షో చేయడం వంటివి చేస్తేనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతారు.

కాజల్ అగర్వాల్‌ మాత్రం ఈ పిక్స్ లో కేవలం కంటి చూపుతో కట్టిపడేస్తుంది. ఆకట్టుకునే అందం తో పాటు, ఆమె హావభావాలు భలే ఉన్నాయి అన్నట్టుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూపు తిప్పనివ్వని అందం కాజల్‌ అగర్వాల్‌ సొంతం అంటూ ఈ ఫోటోలకు నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవ్వబోతున్నా కూడా కాజల్ అగర్వాల్‌ అదే అందంతో పాటు అదే కాన్ఫిడెన్స్ తో సినిమాలు చేయడంను సినీ విశ్లేషకులు కూడా అభినందిస్తున్నారు. మరో పదేళ్ల పాటు ఇండస్ట్రీలో కాజల్‌ అగర్వాల్‌ సినిమాలు చేయాలని, చేస్తుందనే అభిప్రాయం ను పలువురు వ్యక్తం చేస్తున్నారు.