ఇప్పుడు అతడితో సినిమా ఎలా సాధ్యం కాజల్...!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది
By: Tupaki Desk | 22 May 2024 9:46 AM GMTటాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. పెళ్లి తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాతో మొదటి సారి సత్యభామ గా కాజల్ అగర్వాల్ వచ్చేందుకు రెడీ అయ్యింది.
ఈ వారంలో విడుదల అవ్వబోతున్న సత్యభామ సినిమా కోసం కాజల్ అగర్వాల్ గత రెండు వారాలుగా కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ తిరుగుతుంది. కాజల్ అగర్వాల్ చేస్తున్న ప్రమోషన్ తో సత్యభామ సినిమా పై ఆసక్తి పెరిగిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కొన్నాళ్ల క్రితం కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రశాంత్ వర్మ ఆ సినిమాను ప్రారంభించకుండానే పక్కన పెట్టాడు. ఆ తర్వాత హనుమాన్ సినిమాను తీసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
తాజాగా సత్యభామ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రశాంత్ వర్మ తో అనుకున్న సినిమా గురించి చెప్పుకొచ్చింది. ప్రశాంత్ వర్మకు హనుమాన్ సినిమాతో మంచి విజయం దక్కడం చాలా సంతోషం ను కలిగించింది.
మా ఇద్దరి కాంబోలో ఒక సినిమా అనుకున్న మాట వాస్తవమే. కానీ అనుకున్న సినిమాలన్నీ కూడా తుది దశకు చేరుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. కొన్ని సినిమాలు ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్తాయి. మా ఇద్దరి కాంబో మూవీ కూడా కాస్త ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్తుందని ఆశిస్తున్నాను అంది.
హనుమాన్ హిట్ తర్వాత ప్రశాంత్ వర్మ స్థాయి అమాంతం పెరిగింది. బాలీవుడ్ స్టార్ హీరోతో ఇప్పటికే ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు. రాబోయే అయిదు ఏళ్ల వరకు ప్రశాంత్ వర్మ డేట్లు ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. అయినా కూడా కాజల్ అగర్వాల్ ఆశ్చర్యకరంగా తమ సినిమా ఉంటుందని చెప్పడం విడ్డూరంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రశాంత్ వర్మ చేయబోతున్న సినిమాల్లో ఏదైనా పాత్రను కాజల్ తో చేయిస్తే చేయించవచ్చు... అంతే తప్ప ఆమెను లీడ్ రోల్ లో తీసుకుని ప్రశాంత్ వర్మ సినిమా తీస్తాడు అనే నమ్మకం ను ఇండస్ట్రీ వర్గాల్లో ఏ ఒక్కరు వ్యక్తం చేయడం లేదు.