కాజల్ అగర్వాల్ సంచలన నిర్ణయం!
నీల్ భూమ్మీదకు వచ్చి తర్వాత సినిమా...వ్యక్తిగత జీవితాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోయింది. ఇబ్బంది కలిగించే పాత్రల జోలికి అస్సలు వెళ్లడం లేదు.
By: Tupaki Desk | 30 May 2024 6:42 AM GMTకాజల్ అగర్వాల్ సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోలకు పర్పెక్ట్ గా ఛాయిస్ గా కనిపించడంతో సీనియర్లంతా ఆమెకే ఓటేస్తున్నారు. మరోవైపు లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లోనూ అవకాశాలు అందుకుంటుంది. పెళ్లై..పిల్లలు పుట్టిన తర్వాత ఇలా అవకాశాలు అందుకోవడం అంత వీజీ కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారడంతో! చందమా కి కలిసొస్తుంది. అయితే కాజల్ మాత్రం మునుపటిలా సినిమాలు చేయనంటోంది.
ఇప్పుడు ఎంతో సెలక్టివ్ గా ఎంపిక చేసుకోవాల్సి వస్తోందని...అందులోనూ రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం సిద్దంగా లేనని తెలిపింది. అందుకు కొన్ని ప్రత్యేక కారణాలు సైతం చెప్పుకొచ్చింది. 'కుటుంబ బాధ్యతలు పెరగడంతో పాటు కంటికి రెప్పలా కాపాడుకునే బేబి కూడా ఉండటంతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటోంది. ఆన్ సెట్స్ లో ఎలాంటి సన్నివేశాలైనా చేయడానికి సిద్దంగా లేను.
నీల్ భూమ్మీదకు వచ్చి తర్వాత సినిమా...వ్యక్తిగత జీవితాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోయింది. ఇబ్బంది కలిగించే పాత్రల జోలికి అస్సలు వెళ్లడం లేదు. ప్రతీ చిన్న పని కూడా ఎంతో ఆలోచించి చేస్తున్నా. ఈ క్రమంలో నాలో ఓపిక పెరుగుతుంది. ఇతరుల పట్ట సానుభూతి కూడా పెరుగుతుంది. ఇలాంటివి నా కుటుంబంపై ఎలాంటి ప్రతికూలత చూపిస్తుందా? అని సీరియస్ గా ఆలోచన చేస్తున్నా. అందుకే వీలైనంత వరకూ సాహసాలకు దూరంగా ఉండాలనుకున్నా' అని తెలిపింది.
అంటే కాజల్ ముందుకు సాహసో పోతమైన కథలు, సన్నివేశాలు వెళ్తే మాత్రం అలాంటి వాటిలో నటించడానికి ఎంత మాత్రం ఛాన్స్ లేదని తెలుస్తోంది. వీలైనంత వరకూ కంపర్ట్ జోన్ లోనే సినిమాలు చేసే అవకాశం ఉంది. సీనియర్ హీరోలతో సినిమాలంటే పెద్దగా సాహసాలు కూడా ఉండవు. ఇండస్ట్రీలో ఉన్న సీనియర్లు అంతా 60 ఏళ్లు పైబడిన హీరోలే. వాళ్లతో దర్శకులు ఎలాగూ సాహసాలు చేయించరు. వాళ్లతో నటించే హీరోయిన్లకు సౌకర్యంగానే ఉంటుంది.