Begin typing your search above and press return to search.

ఎట్ట‌కేల‌కు ఆ హీరోతోనూ చంద‌మామ‌ !

చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ సీనియ‌ర్ హీరోల‌కు ప‌ర్పెక్ట్ ఛాయిస్ గా క‌నిపిస్తుంది

By:  Tupaki Desk   |   11 May 2024 6:46 AM GMT
ఎట్ట‌కేల‌కు ఆ హీరోతోనూ చంద‌మామ‌ !
X

చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ సీనియ‌ర్ హీరోల‌కు ప‌ర్పెక్ట్ ఛాయిస్ గా క‌నిపిస్తుంది. 60 ఏళ్లు దాటిన హీరోల‌కు 30 ఏళ్లు దాటిన ఈ భామ చ‌క్క‌ని పెయిర్ అవుతుంది. ఇప్ప‌టికే అమ్మ‌డు మెగాస్టార్ చిరంజీవి..న‌ట‌సింహ బాల‌కృష్ణ లాంటి సీనియ‌ర్ హీరోల‌తో రొమాన్స్ చేసింది. తాజాగా అమ్మ‌డికి మ‌రో సీనియ‌ర్ విక్ట‌రీ వెంక‌టేష్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ద‌క్కిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌స్తుతం వెంక‌టేష్ హీరోగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `సంక్రాంతికి వ‌స్తున్నాం` అనే చిత్రం తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఒక హీరోయిన్ గా మీనాక్షి చౌద‌రిని ఎంపిక చేసారు.

అయితే మ‌రో హీరోయిన్ పాత్ర కూడా ఉండ‌టంతో ఆ పాత్ర కోసం సెర్చ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వెంకీ స‌ర‌స‌న జోడీగా కాజ‌ల్ అయితే బాగుంటుంద‌ని ఆమెతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు చిత్ర వ‌ర్గాల నుంచి తెలిసింది. కాజ‌ల్ నుంచి కూడా పాజిటివ్ గానే ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా కూడా ప‌క్కా అనీల్ మార్క్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్. టైటిల్ ని బ‌ట్టే సంక్రాంతి సినిమా అని తేలిపోయింది. వెంకీ కున్న ఫ్యామిలీ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న క‌థ ఇది.

దీంతో హీరోయిన్ పాత్ర కూడా అంతే కీల‌కం అని తెలుస్తుంది. కాజ‌ల్ ఎంట్రీ గ‌నుక ఖ‌రారైతే ఆమె అద‌న‌పు అస్సెట్ అవుతుంది. ఇంత‌వ‌ర‌కూ ఈ కాంబినేష‌న్ లో సినిమా రాలేదు. దీంతో తెర‌పై ప్రెష్ ఫీలింగ్ త‌ప్ప‌నిస‌రి. గ‌తంలో త‌మ‌న్నా- వెంకటేష్ కాంబినేష‌న్ కూడా పండిన సంగ‌తి తెలిసిందే. దీంతో కాజ‌ల్- వెంక‌టేష్ కాంబో మ‌రింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం కాజ‌ల్ `ఇండియ‌న్ -2` లో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న కూడా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

అలాగే `స‌త్య‌భామ` అనే లేడీ ఓరియేంటెడ్ సినిమా కూడా చేసింది. ఈనెల‌లోనే ఆసినిమా ప్రేక్ష‌కుల ముందు కొస్తుంది. బాలీవుడ్ లో `ఉమా` అనే మ‌రో సినిమా కూడా చేస్తుంది. ఇలా కాజ‌ల్ సెకెండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతుంది. పెళ్లి చేసుకున్నా..పిల్ల‌లున్నా వృత్తి గ‌త జీవితంతో ఎలాంటి సంబంధం లేద‌ని పుల్ ఫామ్ లో ముందుకెళ్తుంది. కాజ‌ల్ లాగే మ‌రికొంత మంది హీరోయిన్ల జ‌ర్నీ కూడా సాగుతోన్న సంగ‌తి తెలిసిందే.