Begin typing your search above and press return to search.

కాజల్ - త్రిష.. ఇలా అయ్యిందేంటి?

ఈ సీనియర్ బ్యూటీస్ కి అవకాశాలు అయితే భాగానే వస్తోన్న చెప్పుకోదగ్గ పాత్రలు మాత్రం చేయలేకపోతున్నారు.

By:  Tupaki Desk   |   21 Oct 2023 4:42 AM GMT
కాజల్ - త్రిష.. ఇలా అయ్యిందేంటి?
X

స్టార్ హీరోయిన్స్ గా సౌత్ ఇండియాలో సుదీర్ఘకాలం తమ ఆధిపత్యం కొనసాగించిన అందాల భామలు కాజల్, త్రిష. త్రిష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటిపోతోంది. కాజల్ కూడా హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసి 16 ఏళ్ళు అవుతుంది. ఇద్దరు ఇటు తెలుగు, అటు తమిళనాట స్టార్ హీరోయిన్స్ గా తమ హవాని కొనసాగించారు.

అయితే ఇప్పుడు వీరు సీనియర్ హీరోయిన్స్ కేటగిరీలో చేరిపోయారు. ప్రస్తుతం స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయని చెప్పాలి. అయితే త్రిషకి మాత్రం పొన్నియన్ సెల్వన్ సిరీస్ తర్వాత మరల కెరియర్ స్పీడ్ అయ్యింది. తాజాగా దళపతి విజయ్ లియో మూవీతో నటించింది. అలాగే అజయ్ కి జోడీగా ఓ సినిమా స్టార్ట్ అయ్యింది.

ఇటు కాజల్ అగర్వాల్ బాలయ్యకి జోడీగా భగవంత్ కేసరి చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర సపోర్టింగ్ రోల్ కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ అన్నట్లు ఉంది. భగవంత్ కేసరికి జోడీగా నటించిన చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ అయితే కాజల్ అగర్వాల్ కి లభించలేదని చెప్పాలి. పేరుకే హీరోయిన్ అయిన కథ మొత్తం శ్రీలీల చుట్టూనే తిరుగుతుంది.

అలాగే లియో మూవీలో దళపతి విజయ్ భార్య పాత్రలో ఇద్దరి పిల్లల తల్లిగా త్రిష నటించింది. ఈ చిత్రంలో ఆమెకి స్క్రీన్ స్పేస్ ఎక్కువగానే లభించింది. విజయ్ ని నడి వయస్సులో ఉన్న వ్యక్తిగా చూపించడంతో అతనికి జోడీగా త్రిష మూవీలో సెట్ అయ్యింది. మరీ ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితే కాదని చెప్పాలి. సినిమా కంటెంట్ అంతా విజయ్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది.

ఈ సీనియర్ బ్యూటీస్ కి అవకాశాలు అయితే భాగానే వస్తోన్న చెప్పుకోదగ్గ పాత్రలు మాత్రం చేయలేకపోతున్నారు. ఏదో హీరోయిన్ రోల్ ఉండాలి కాబట్టి, కాస్తా గ్లామర్ టచ్ కోసం వీరిని ఎంపిక చేస్తున్నట్లు ఉంది. బలమైన పాత్రలు వారు మాత్రమే చేయగలరు అనే రీజన్ తో మాత్రం దర్శకులు ఎంపిక చేయడం లేదని తెలుస్తోంది.