అంబానీ ఇంట మెరుపులా చందమామ!
ఇటీవలే సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కానీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది.
By: Tupaki Desk | 14 July 2024 9:51 AM GMTచందమామ కాజల్ అగర్వాల్ సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోలకు పర్పెక్ట్ ఛాయిస్ గా నిలుస్తూ అవకాశాలు అంది పుచ్చుకుంటుంది. లేడి ఓరియేంటెడ్ చిత్రాల్లో సైతం అవకాశాలు అందుకుని తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంది. కానీ అమ్మడికి ఇంకా ఉమెన్ సెంట్రిక్ పరంగా సరైన స్టోరీ పడలేదు. ఇటీవలే సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కానీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది.
అలాగే నెట్టింట కూడా నిత్యం అభిమానులు ఏదో రూపంలో టచ్ లో ఉంటుంది. కొత్త ఫోటోలతో యువతని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటుంది. మామ్ అయిన తర్వాత ఇన్ స్టా యాక్టివిటీని మరింత స్పీడప్ చేసింది. గర్భందాల్చిన సమయంలోనే తెలివిగా బేబిబంప్ ని ఎన్ క్యాష్ చేసుకుంది. బేబిప్రొడక్ట్ ల్ని ప్రచారం చేస్తూ ఇంట్లో కూర్చునే సంపాదించేసింది. అంతవరకూ ఏ నటి ఇలాంటి ఛాన్స్ తీసుకోలేదు.
కానీ కాజల్ మాత్రం ఈ విషయంలో ఎంతో తెలివిగా వ్యవహారించి కాసులు రాబట్టుకుంది. తాజాగా అంబానీ ఇంట అతిధిగా విచ్చేసిన అమ్మడు ఆ డిజైనర్ దుస్తుల్లో ముస్తాబైన వైనాన్ని నెటి జనులతో పంచుకుంది. ఇదిగో ఇక్కడిలా సంప్రదాయ పంజాబీ డిజైన్ మెరుపు డిజైన్ లో మురుపించింది. మెడలో ధరించిన బంగారు హారం..మ్యాచింగ్ చెవు భుట్టలు ప్రతీది చందమామ అందాన్ని రెట్టింపు చేసాయి.
ఇక మ్యాకప్ పరంగా అంతే జాగ్రత్తలు తీసుకుంది. కళ్లకు ఐటెక్స్.. ఐబ్రోస్..నుదిటిన చిన్న స్టికర్..పెదాలకు ఎర్రని లిప్ స్టిక్ పూసుకుని మరింత ఆకర్షణీయంగా ముస్తాబైంది. శుభ్ ఆశ్వీర్వాద్ లో భాగంగా కాజల్ హాజరైంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కాజల్ అభిమానుల్ని పిక్ ఆకట్టుకుంటుంది.