Begin typing your search above and press return to search.

కాజల్ కోసం అరుంధతి లాంటి కథ..?

ఒకప్పుడు పెళ్లి తర్వాత సినిమా చేస్తే హీరోయిన్స్ కు అంతగా మార్కెట్ ఉండేది కాదు.

By:  Tupaki Desk   |   31 May 2024 11:30 AM GMT
కాజల్ కోసం అరుంధతి లాంటి కథ..?
X

ఒకప్పుడు పెళ్లి తర్వాత సినిమా చేస్తే హీరోయిన్స్ కు అంతగా మార్కెట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది హీరోయిన్ కి పెళ్లై పిల్లలు ఉన్నా సరే చేస్తున్న సినిమాలు.. వస్తున్న పాత్రలతో అలరిస్తే చాలు వాళ్లని ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియన్స్. బాలీవుడ్ లో ఆల్రెడీ పెళ్లై కూడా టాప్ ప్లేస్ లో ఉంటున్న హీరోయిన్స్ ఉండగా సౌత్ లో కూడా ఈమధ్య పెళ్లైన భామలకు డిమాండ్ కొనసాగుతుంది. సౌత్ లో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న నయనతార, సమంత, కాజల్ ఇలా పెళ్లైన భామలు కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు.

మొన్నటిదాకా కమర్షియల్ సినిమాలు చేసిన కాజల్ పెళ్లి తర్వాత తన పంథా మార్చాలని ఫిక్స్ అయ్యింది. అందుకే కెరీర్ లో ఫస్ట్ టైం ఫిమేల్ సెంట్రిక్ మూవీగా సత్యభామ సినిమా అటెంప్ట్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే కాజల్ యాక్షన్ సీన్స్ అదరగొట్టేసిందని అనిపిస్తుంది. జూన్ 7న కాజల్ హిట్ కొడితే మాత్రం ఆమెతో ఇలాంటి ప్రయోగాలు చేసేందుకు దర్శక నిర్మాతలు రెడీ అవుతారు.

ఇదిలా ఉంటే కాజల్ సత్య భామ చేస్తున్న టైం లోనే ఆమెకు ఒక కథ వచ్చిందట. అనుష్క అరుంధతి తరహాలోనే ఈ కథ ఉందని ఫిల్మ్ నగర్ టాక్. కాజల్ కూడా కథ విని ఎగ్జైట్ అయినట్టు టాక్. సత్యభామ రిజల్ట్ ని బట్టి ఆ సినిమాని ఓకే చెయ్యాల వద్దా అని అనుకుందట. అయితే అరుంథతి లాంటి కథ అనగానే అనుష్క అరుంధతి చేసింది కదా మరి మళ్లీ అదే ఎందుకు అంటే అనుష్కకు ఆ సినిమా ఎంత పేరు తెచ్చిందో కాజల్ కి కూడా అంత పేరు తెచ్చే కథ అని అంటున్నారు.

అనుష్క కెరీర్ లో అరుంధతి సినిమా ఒక మైల్ స్టోన్ మూవీ అని తెలిసిందే. కాజల్ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మళ్లీ కెరీర్ దూసుకెళ్లాలంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలే బెస్ట్ అని అనుకుంటుంది. మరి కాజల్ చేస్తున్న ఈ ప్రయోగాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది చూడాలి. కాజల్ సత్యభామ హిట్ పడితే మాత్రం ఆమె కెరీర్ లో మరికొన్ని డేరింగ్ ప్రాజెక్ట్స్ చేస్తుందని కచ్చితంగా చెప్పొచ్చు. పెళ్లైనా సరే సినిమా కోసం తాను ఎంత కష్టపడటానికైనా సిద్ధం అనేస్తుంది కాజల్. సత్యభామ కోసం కూడా ఆమె రిస్కీ యాక్షన్ సీన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.