Begin typing your search above and press return to search.

కాజల్ సత్యభామ టీజర్.. ఎలా ఉందంటే..

ఇప్పటి వరకు కమర్షియల్ మూవీస్ లో రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకి పరిమితం అయిన కాజల్ అగర్వాల్ అప్పుడప్పుడు ఫిమేల్ సెంట్రిక్ కథలతో మెప్పించే ప్రయత్నం చేసింది.

By:  Tupaki Desk   |   10 Nov 2023 7:35 AM GMT
కాజల్ సత్యభామ టీజర్.. ఎలా ఉందంటే..
X

ఇప్పటి వరకు కమర్షియల్ మూవీస్ లో రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకి పరిమితం అయిన కాజల్ అగర్వాల్ అప్పుడప్పుడు ఫిమేల్ సెంట్రిక్ కథలతో మెప్పించే ప్రయత్నం చేసింది. అయితే మొదటి సారి యాక్షన్ క్వీన్ రోల్ లో సత్యభామ సినిమాలో నటిస్తోంది. సుమన్ చిక్కాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే అందించారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ సమకూర్చారు.

దీపావళి విషెస్ తో ఈ మూవీ టీజర్ ని తాజాగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. మూవీలో కాజల్ అగర్వాల్ ఏసీపీ సత్యభామ పాత్రలో నటిస్తోంది. ఆమె కళ్ళముందే ప్రాణాలు కోల్పోయిన ఒక అమ్మాయి హత్య కేసుని ఇన్వెస్టిగేషన్ బాద్యతలని సత్యభామ తీసుకుంటుంది. అయితే అర్ధంతరంగా ఆ కేసు నుంచి ఉన్నతాధికారులు ఆమెని తప్పిస్తారు. కాని చనిపోయిన అమ్మాయి మరణానికి కారణం, ఆమెని చంపింది ఎవరు తెలుసుకోవడానికి సత్యభామ తన వేట మొదలు పెడుతుంది.

ఫైనల్ గా మర్డర్ మిస్టరీని ఎలా చేధించింది అనేది టీజర్ ద్వారా ఇంటరెస్టింగ్ గా చూపించే ప్రయత్నం చేశారు. సత్యభామ పాత్రలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కాజల్ అగర్వాల్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. కంప్లీట్ బాడీ లాంగ్వేజ్, స్టైల్ మార్చేసి యాక్షన్ క్వీన్ లా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్న విధానం ఇంటరెస్టింగ్ గా ఉందని చెప్పాలి. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ కూడా సినిమాకి బలం అందించే విధంగా ఉందని చెప్పొచ్చు.

శ్రీనివాసరావు తక్కలపల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్కా సమర్పిస్తున్నారు. కంప్లీట్ ఫిమేల్ సెంట్రిక్ తో యాక్షన్ కమర్షియల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆవిష్కరించారు. కచ్చితంగా ఈ సినిమాతో కాజల్ అగర్వాల్ ఇమేజ్ మారిపోయే అవకాశం ఉందనే మాట టీజర్ చూసిన వారి నుంచి వినిపిస్తోంది.

సీనియర్ హీరోయిన్ జాబితాలోకి వెళ్ళిపోయిన ఈ అమ్మడుకి సత్యభామ బ్రేక్ ఇస్తే మాత్రం యాక్షన్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి పోటీగా స్టార్ హీరోల సినిమాలు లేకుండా ఉంటే మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.