కాజల్ సత్యభామ ఎఫెక్ట్.. 3రోజుల్లో 7వేల యాప్ డౌన్లోడ్స్
దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో మెప్పిస్తున్న కాజల్.. తన ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ యాక్షన్ సీక్వెన్స్ లో అద్భుతంగా నటించి ఫిదా చేసింది.
By: Tupaki Desk | 9 Jun 2024 3:40 AM GMTటాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన ఈ అమ్మడు.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బాబు పుట్టాక.. రీఎంట్రీ ఇచ్చి అదరగొడుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్ లో వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. అలా రీసెంట్ గా సత్యభామ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాజల్ అగర్వాల్.
క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన సత్యభామ సినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ మూవీని శ్రీనివాసరావు టక్కళ్లపల్లి, బాబీ తిక్క సంయుక్తంగా నిర్మించారు. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగనీడు, హర్షవర్ధన్, రవి వర్మ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా.. మిక్స్ డ్ టాక్ అందుకుంది. కానీ కాజల్ మాత్రం అదరగొట్టేసింది.
దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో మెప్పిస్తున్న కాజల్.. తన ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ యాక్షన్ సీక్వెన్స్ లో అద్భుతంగా నటించి ఫిదా చేసింది. హీరోలతో సమానంగా యాక్ట్ చేసి మెప్పించింది. ఎమోషన్స్ సీన్స్ లో కూడా తనలోని యాక్టింగ్ స్కిల్స్ ను చూపించింది. మొత్తంగా సినిమా కోసం కాజల్ బాగానే కష్టపడినట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ లో ఇలాంటి కథలను కాజల్ ఈజీగా చేసేస్తుందనిపిస్తుంది.
అయితే సినిమాలో షీ సేఫ్ యాప్ ను మహిళలు, యువతలు ఎలా ఉపయోగించాలో చక్కగా చూపించారు మేకర్స్. ఈ విషయాన్ని కాజల్ ఇప్పటికే ప్రమోషన్స్ లో భాగంగా పలుమార్లు చెప్పింది. ఇప్పుడు ఈ యాప్ ను మూడు రోజుల్లో 7000 వేల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో మేకర్స్ అనౌన్స్ చేశారు. మహిళలు, యువతులు షీ సేఫ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, సేఫ్ గా ఉండండని రాసుకొచ్చారు.
ఇక మేకర్స్.. సత్యభామ రిలీజ్ కు ముందు మహిళల కోసం స్పెషల్ ఫ్రీ మూవీ షో కూడా ఏర్పాటు చేశారు. జూన్ 5న హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రీమియర్ షో వేశారు. తమ మొబైల్ లో షీ సేఫ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నవారికి ఫ్రీ టికెట్స్ అందించారు. ఈ షోకు కాజల్ కూడా వచ్చి సందడి చేసింది. అలా ముందు నుంచి మహిళలను బేస్ చేసుకుని ప్రమోషన్స్ చేసిన మేకర్స్.. ఇప్పుడు యాప్ డౌన్లోడ్స్ పెరగడంతో ఆనందం వ్యక్తం చేశారు!