Begin typing your search above and press return to search.

కాజోల్ ది ట్రయల్ ఎలా ఉంది..!

ఆ వెబ్ సీరీస్ జస్ట్ ఓకే అనిపించగా లేటెస్ట్ గా మరో వెబ్ సీరీస్ ది ట్రయల్ తో వచ్చారు కాజోల్

By:  Tupaki Desk   |   14 July 2023 3:36 PM GMT
కాజోల్ ది ట్రయల్ ఎలా ఉంది..!
X

బాలీవుడ్ యాక్ట్రెస్ కాజోల్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఒకప్పుడు లవ్ స్టోరీస్, కమర్షియల్ సినిమాల్లో ఆమె ఉంది అంటే సినిమా సూపర్ హిట్ పక్కా అన్న జోష్ ఉండేది. బాలీవుడ్ స్టార్స్ అందరితో కాజోల్ జత కట్టింది. ఇక కొద్దిపాటి గ్యాప్ తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కాజోల్ ఈమధ్యనే లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సీరీస్ లో నటించింది. ఆ వెబ్ సీరీస్ జస్ట్ ఓకే అనిపించగా లేటెస్ట్ గా మరో వెబ్ సీరీస్ ది ట్రయల్ తో వచ్చారు కాజోల్. కోర్ట్ రూం డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ చేశారు. తెలుగుతో పాటుగా ఏడు భాషల్లో ఈ వెబ్ సీరీస్ అందుబాటులో ఉంది.

ఇంతకీ ది ట్రయల్ కథ ఏంటంటే రాజీవ్ సేన్ గుప్తా (జిష్ సేన్ గుప్త) ఓ హైకోర్టు అడిషనల్ జడ్జి. అయితే అతని మీద లైంగిక ఆరోపణలు, అవినీతి కేసులు రావడంతో అతను జైలు పాలవుతాడు. భర్త జైలు కెళ్లడం వల్ల కుటుంబ బాధ్యతని తన మీద వేసుకుంటుంది నొయోనిక సేన్ గుప్త (కాజోల్). బిఫోర్ మ్యారేజ్ లాయర్ గా పనిచేసిన ఆమె ఆ తర్వాత దాన్ని వదిలేస్తుంది.

కానీ భర్తను బయటకు తీసుకు రావాలని స్నేహితుడు విశాల్ (అలీ ఖాన్) భర్త కేసు వాధిస్తుంది. నొయోనిక భర్తను బయటకు తీసుకు వచ్చిందా..? రాజీవి నిజంగానే తప్పు చేశాడా..? ఇలాంటి వాటికి ఆన్సర్ తెలియాలంటే వెబ్ సీరీస్ చూడాల్సిందే.

చేయని తప్పుకి భర్తను అరెస్ట్ చేయడమే కాకుండా అతని మీద పడిన ముద్ర చెరిపేయాలని భార్య చేసిన సాహసమే ది ట్రయల్ సీరీస్ కథాంశం. ఈ సీరీస్ అమెరిక సీరీస్ ది గుడ్ వైఫ్ ని ఆధారంగా తీసుకుని తెరకెక్కించారు. ఎనిమిది ఎపిసోడ్ లతో వచ్చిన ఈ సీరీస్ తొలి ఎపిసోడ్ నుంచే కథలోకి తీసుకెళ్లాడు డైరెక్టర్.

అయితే ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల పాటు ఉండటం కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. అంతేకాదు మెయిన్ ఫ్లాట్ కి సంబంధం లేకుండా కొత్త కేసులు తెర మీద తీసుకు రావడం కూడా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్ స్టార్టింగ్ లో రాజీవ్, నొయోనికా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఆసక్తి కలిగిస్తాయి. ఆ సీన్స్ మధ్య ఎమోషన్ ఇంకాస్త పెంచితే బాగుండేది అనిపిస్తుంది. అయితే కోర్ట్ నేపథ్యంతో సాగే వాదన, ప్రతివాదనలు అన్ని అంత ఇంప్రెసివ్ గా అనిపించవు.

వృత్తిపరంగా తల్లిదండ్రులు బిజీగా ఉంటే పిల్లలు ఏం చేస్తారు అన్నది వారు ఎలాంటి పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుంది అన్నది ఈ సీరీస్ లో చూపించారు. కాజోల్ వన్ మ్యాన్ షోగా ఈ సీరీస్ నడిపించింది. మంచి స్కోప్ ఉన్న పాత్రలో కాజోల్ మెప్పించింది.

రాజీవ్ సేన్ గుప్త గా చేసిన జిషు గుప్త కూడా బాగానే చేశారు. ఇతర పాత్రధారులంతా కూడా పరిధి మేరకు నటించారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఓకే అనిపిస్తాయి. అయితే ఎడిటింగ్ మీద ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఫ్యామిలీ మ్యాన్ కి డైలాగ్స్, రానా నాయుడు దర్శక ద్వయం లో ఒకరైన సువర్ణ్ వర్మ చేసిన ఈ ప్రయత్నం ఓటీటీ ఆడియన్స్ ను కొంతమేరకు ఇంప్రెస్ చేస్తుంది.