Begin typing your search above and press return to search.

కల్కి.. ప్రమోషన్స్ ఖర్చులు కూడా ఓ రికార్డే..

కాబట్టి కల్కి 2898AD సినిమా వస్తే తప్పకుండా మళ్లీ మార్కెట్ ఊపందుకుంటుంది అని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు.

By:  Tupaki Desk   |   21 May 2024 1:03 PM GMT
కల్కి.. ప్రమోషన్స్ ఖర్చులు కూడా ఓ రికార్డే..
X

టాలీవుడ్ లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా మార్కెట్లో చాలా రోజుల తర్వాత ఒక బిగ్గెస్ట్ సినిమాతో ప్రభాస్ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. అసలే థియేటర్స్ ఈమధ్య చాలా వరకు నష్టాల్లో కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి కల్కి 2898AD సినిమా వస్తే తప్పకుండా మళ్లీ మార్కెట్ ఊపందుకుంటుంది అని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు.

ఇక వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపిస్తుందని మేకర్స్ ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ హడావుడి రీసెంట్ గానే మొదలయ్యింది. ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ కాస్త నెమ్మదిగా కొనసాగుతున్నారు అనే కామెంట్స్ కు త్వరలోనే సమాధానం చెప్పబోతున్నారు.

సినిమా విడుదలకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. కాబట్టి ఈ లోపు ప్రపంచ వ్యాప్తంగా సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు. ముందుగా తెలుగులోనే ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. రామోజీ ఫిలిం సిటీ లో బుధవారం మీడియా అభిమానుల సమక్షంలో ఒక గ్రాండ్ వేడుకకు వేదిక సిద్ధమైంది.

ఇక ఇందులో మేకర్స్ ఆడియన్స్ మీడియా సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోతున్నారు. అయితే ప్రమోషన్స్ కోసమే వైజయంతి నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఇక ప్రమోషన్స్ కోసమే దాదాపు 40 నుంచి 60 కోట్ల మధ్యలో ఖర్చవుతున్నట్లుగా తెలుస్తోంది.

బడ్జెట్ లోనే కాకుండా ప్రమోషన్స్ ఖర్చులో కూడా కల్కి రికార్డు క్రియేట్ చేస్తోంది. సినిమా వెయ్యి కోట్ల టార్గెట్ ను తొందరగా అందుకోవాలి అంటే ఆ రేంజ్ లో అయితే ముందుగా పెట్టుబడి పెట్టాల్సిందే. ఇక ఐపీఎల్ లో ఒక యాడ్ కోసం కూడా గట్టిగానే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. 12 సెకండ్ల ఐపిఎల్ అడ్వర్టైజ్మెంట్ కోసం దాదాపు మూడు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.

గతంలో ఏ సినిమాకు కూడా ఈ రేంజ్ లో అయితే ప్రమోషన్స్ కోసం ఖర్చు చేయలేదు. ప్రభాస్ కెరియర్ లోనే కాకుండా ఇండియన్ ఫిలిం హిస్టరీ లో అత్యధిక భారీ బడ్జెట్ తో కల్కి సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే రాబోయే పాన్ ఇండియా సినిమాలకు మరింత బలం కూడా చేయకరుతుంది అని చెప్పవచ్చు. సినిమాలో స్టార్ క్యాస్టింగ్ కూడా అంచనాలను పెంచుతోంది. దీపిక పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ దిశా పటాని లాంటి వాళ్ళు సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న రాబోతున్న కల్కి సినిమా ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.