Begin typing your search above and press return to search.

కల్కి 2898ఏడీ లీక్ పై చిత్ర యూనిట్ క్లారిటీ

కల్కి మూవీ గ్లింప్స్ రిలీజ్ కి ముందు అందులో కొంత పార్ట్ లీక్ అయ్యింది. తరువాత వైజయంతీ మూవీస్ స్ట్రిక్ట్ నోట్ రిలీజ్ చేసింది.

By:  Tupaki Desk   |   21 July 2024 12:16 PM GMT
కల్కి 2898ఏడీ లీక్ పై చిత్ర యూనిట్ క్లారిటీ
X

కల్కి 2898ఏడీ మూవీ ఈ ఏడాదిలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న చిత్రంగా నిలిచింది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల వసూళ్లని క్రాస్ చేసింది. గత ఏడాది షారుఖ్ ఖాన్ నుంచి వచ్చిన పఠాన్, జవాన్ కలెక్షన్స్ ని కూడా క్రాస్ చేసే దిశగా కల్కి మూవీ అడుగులేస్తోంది. టోటల్ రన్ లో 1100+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని కల్కి మూవీ అందుకుంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో కల్కి సినిమాని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు.

ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ పాన్ వరల్డ్ మూవీగా కల్కి థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సక్సెస్ ని ప్రస్తుతం చిత్ర యూనిట్ ఫుల్ గా ఆస్వాదిస్తోంది. మూడేళ్లు పడిన కష్టానికి అద్భుతమైన ఫలితాన్ని ప్రేక్షకులు ఇవ్వడంతో అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ సందర్భంగా టెక్నీషియన్స్ అందరూ వారి వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. నేటికి గ్లింప్స్ రిలీజ్ అయ్యి ఏడాది అయ్యింది.

ఈ సందర్భంగా వైజయంతీ మూవీస్ ట్విట్టర్ లో ఇంటరెస్టింగ్ పోస్ట్ పెట్టింది. కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ప్రాజెక్ట్ కె గ్లింప్స్ రిలీజ్ చేసి నేటికి ఏడాది అయ్యింది. ఈ రోజుకి ఫాస్ట్ ఫార్వార్డ్ చేసి చూసుకుంటే కల్కి మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో కొనసాగుతోంది. అయితే తమకంటే ముందుగా గ్లింప్స్ ని ఎవరు రిలీజ్ చేసారనేది ఇంకా తెలియలేదు. ఇప్పటికి ఫైండ్ చేస్తూనే ఉన్నామని పోస్ట్ పెట్టారు.

కల్కి మూవీ గ్లింప్స్ రిలీజ్ కి ముందు అందులో కొంత పార్ట్ లీక్ అయ్యింది. తరువాత వైజయంతీ మూవీస్ స్ట్రిక్ట్ నోట్ రిలీజ్ చేసింది. అలాగే మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా కొన్ని లీక్ ఫోటోలు, వీడియోలు బయటకొచ్చాయి. వీటిని ఎవరు చేసారనేది ఇప్పటికి ఐడెంటిఫై చేయలేకపోవడం చూస్తుంటే చాలా పకడ్బందీగా చేసినట్లు అర్ధమవుతోంది.

ఇదిలా ఉంటే కల్కి 2898ఏడీ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో కొనసాగుతూ ఉండటంతో పాటు పార్ట్ 2 ఎప్పుడొస్తుందనే ప్రశ్న కూడా పబ్లిక్ నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం ఆర్టిస్ట్స్ అందరూ కూడా వారి వారి సినిమాలు, ఇతర యాక్టివిటీస్ లో బిజీగా ఉన్నారు. అందరూ అందుబాటులోకి వచ్చాక షూటింగ్ ఎప్పుడనేది కన్ఫర్మ్ చేస్తారు. అలాగే షూటింగ్ షెడ్యూల్ బట్టి రిలీజ్ పైన కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.