ఒకే గుడిలో ఆ నటుడి పెళ్లి.. వారసులందరి పెళ్లిళ్లు
ఈ జంట తమ మొదటి పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పెళ్లికి సినీరాజకీయరంగాలకు చెందిన ప్రముఖులు అటెండయ్యారు.
By: Tupaki Desk | 9 Dec 2024 4:03 AM GMTసీనియర్ తమిళనటుడు జయరామ్ పరిచయం అవసరం లేదు. అనువాద చిత్రాలతోను అతడు ఇరుగుపొరుగునా పాపులర్. దళపతి విజయ్ నటించిన తుపాకి (తుప్పాక్కి-తమిళం)లో ఆర్మీ అధికారిగా తనదైన హాస్యం పండించారు. ఇప్పుడు అతడి ఇంట పెళ్లి సందడి నెలకొంది. తనయుడు కాళిదాస్ జయరామ్ తన స్నేహితురాలు, మోడల్ తారిణి కళింగరాయర్‌ను కేరళలోని గురువాయూర్ ఆలయంలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు.
ఈ జంట తమ మొదటి పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పెళ్లికి సినీరాజకీయరంగాలకు చెందిన ప్రముఖులు అటెండయ్యారు. అమలా పాల్, దుషారా విజయన్, జోజు జార్జ్, అయేషా ఖాన్, మంజిమా మోహన్ తదితరులు హార్ట్ ఎమోజీలను షేర్ చేసి అభినందించారు. నటుడు-ఎంపీ సురేష్ గోపి, కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ సహాయ మంత్రి , పబ్లిక్ వర్క్స్ & టూరిజం శాఖ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా తదితరులు హాజరయ్యారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గురువాయూర్ ఆలయంలో కాళిదాస్ కుటుంబంలో ఇది మొదటి వివాహం కాదు. ఇక్కడే అతడి తల్లిదండ్రులు జయరామ్ - పార్వతి 1992లో తమ సినీ కెరీర్‌లో అత్యుత్తమ స్థితిలో ఉన్న సమయంలో వివాహం చేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కాళిదాస్ సోదరి మాళవిక జయరామ్ కూడా అదే ఆలయంలో నవనీత్ గిరీష్‌ను వివాహం చేసుకున్నారు.
ఇటీవల కాళిదాస్ భార్య, మోడల్ తారిణి మిస్ యూనివర్స్ ఇండియా 2021లో మూడవ రన్నరప్‌గా నిలిచింది. విజువల్ కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేట్ అయిన తారిణి మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. పలు బ్రాండ్‌లకు మోడల్ గా పని చేసింది. కాళిదాస్ తమిళ చిత్రసీమలో నటుడిగా తనకంటూ ఒక స్థాయిని అందుకున్నాడు. పావ కడైగల్, విక్రమ్, ఇండియన్ 2 లాంటి భారీ చిత్రాలలో నటించాడు.
పెళ్లి అనంతరం నటుడు జయరామ్ మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి పెళ్లి వేడుక ఈ ప్రఖ్యాత ఆలయంలో జరగడంపై హర్షం వ్యక్తం చేశారు. 32 ఏళ్ల క్రితం మా పెళ్లిని చూసేందుకు ప్రజలు గుమిగూడినట్లే మా అబ్బాయి పెళ్లిని కూడా జరుపుకోవడానికి వచ్చినందుకు నేను నిజంగా కృతజ్ఞుడను అని ఆయన అన్నారు.