స్టార్ నటుడి వారసుడి పెళ్లి సందడి
ముఖ్యంగా కోలీవుడ్‌లో ఈయన హీరోగా సినిమాలు చేయడంతో పాటు కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కనిపించాడు.
By: Tupaki Desk | 8 Dec 2024 9:31 AM GMTతెలుగుతో పాటు తమిళ్, మలయాళం భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న జయరామ్ వారసుడు కాళిదాస్. ఈయన కూడా నటుడి గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఈయన హీరోగా సినిమాలు చేయడంతో పాటు కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కనిపించాడు. ఇటీవల ధనుష్ హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన రాయన్ సినిమాలో కాళిదాస్ ముఖ్య పాత్రలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేయడం మంచి విషయం.
జయరామ్ సైతం ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించడంతో మంచి పేరును సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఆయన గుంటూరు కారం సినిమాతో పాటు అల వైకుంఠపురం సినిమాలో నటించారు. ఆ రెండు సినిమాల్లోనూ జయరామ్‌కి త్రివిక్రమ్ చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఇవ్వడం జరిగింది. ఆ సినిమాలతో పాటు మరికొన్ని తమిళ సినిమాలను సైతం చేశాడు. టాలీవుడ్‌లో ముఖ్య పాత్రలకు జయరామ్ మోస్ట్ వాంటెడ్‌గా నిలిచిన విషయం తెల్సిందే.
ఇప్పుడు జయరామ్ తనయుడు కాళిదాస్ పెళ్లి పీటలు ఎక్కడంతో వార్తల్లో నిలిచాడు. మోడలింగ్‌లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ ఉన్న తరణితో కాళిదాస్ వివాహం జరిగింది. తరణి అందాల పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా మిస్ తమిళనాడు, మిస్ సౌత్ ఇండియా పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలవడం జరిగింది. గత కొంత కాలంగా తరణితో కాళిదాస్ ప్రేమ వ్యవహారం సాగుతోంది. ఇద్దరి మధ్య ప్రేమెకు సంబంధించిన వార్తలు కోలీవుడ్ మీడియాలో గతంలో ఒకటి రెండు సార్లు వచ్చాయి.
గురవారం చెన్నైలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జరిగాయి, నేడు ఉదయం సింపుల్‌గా ప్రముఖుల సమక్షంలో వివాహం జరిగింది. వీరి వివాహ వేడుకకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. నటుడిగా కాళిదాస్ త్వరలోనే తెలుగు సినిమాల్లోనూ నటించే అవకాశాలు ఉన్నాయని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో జయరామ్ పేర్కొన్నారు. మంచి పాత్రలతో అలరించడం ద్వారా హీరో స్థాయి ఇమేజ్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే కాళిదాస్ హీరో పాత్రలనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ సినిమాలు చేస్తున్నారు.