కలియుగం పట్టణంలో.. వచ్చేది ఎప్పుడంటే..
ప్రస్తుతం విశ్వ.. కలియుగం పట్టణంలో అంటూ ఓ ఇంటెన్స్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీతో రాబోతున్నారు.
By: Tupaki Desk | 19 Feb 2024 11:36 AM GMTవిశ్వ కార్తికేయ.. బాలనటుడిగా ఎన్నో సినిమాలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. బాలనటుడిగా 50కిపైగా సినిమాల్లో నటించిన విశ్వ.. జై సేన చిత్రంతో హీరో అయిపోయారు. కళాపోషకులు, అల్లంత దూరాన మూవీల్లో తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం విశ్వ.. కలియుగం పట్టణంలో అంటూ ఓ ఇంటెన్స్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీతో రాబోతున్నారు.
మంచి మెసేజ్ ఇచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయింది. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో 45 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ మూవీని కందుల గ్రూప్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా చిత్రీకరణ పూర్తయిందని నిర్మాత తెలిపారు. అందుకు సహకరించిన చిత్ర బృందానికి థ్యాంక్స్ చెప్పారు.
ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు నిర్మాత ఓబుల్ రెడ్డి తెలిపారు. మార్చి 22వ తేదీన ఈ సినిమాను థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. అందుకు మేకర్స్ ప్రస్తుతం ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని సినీ ప్రియులు ఆదరిస్తారన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.
ఈ సినిమాను కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మిస్తుండగా.. రమా కాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో ఆయన దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. స్క్రీన్ ప్లే బాధ్యతలను ఆయనే చేపట్టారు. డైలాగ్స్ కూడా ఆయనే అందించారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశ్వ కార్తికేయకు జోడీగా ఆయుషీ పటేల్ నటిస్తోంది.
కలియుగం పట్టణంలో మూవీకి ఎడిటర్ గా ఫేమస్ టెక్నీషియన్ గారీ బిహెచ్ వ్యవహరిస్తున్నారు. అజయ్ అర్సాద మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ప్రముఖ గేయరచయితలు చంద్రబోస్, భాస్కర భట్ల సాహిత్యం అందిస్తుండగా.. చరణ్ మాధవనేయ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. మరి ఈ కలియుగం పట్టణంలో మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.