Begin typing your search above and press return to search.

ప్రభాస్ కల్కి.. మరో అరుదైన ఘనత

'కల్కి 2898ఏడీ' మూవీ గ్రాండ్ సక్సెస్ తో దీనికి సీక్వెల్ గా రాబోయే మూవీ పైన ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉన్నాయి.

By:  Tupaki Desk   |   28 Sep 2024 5:59 AM GMT
ప్రభాస్ కల్కి.. మరో అరుదైన ఘనత
X

ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ 'కల్కి 2898ఏడీ' ఈ ఏడాది ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా నిలిచింది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మైథలాజికల్ కాన్సెప్ట్ చిత్రంగా 'కల్కి 2898ఏడీ' తెరకెక్కింది. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో విజువల్ స్పెక్టక్యులర్ గా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. 'కల్కి 2898ఏడీ' మూవీ గ్రాండ్ సక్సెస్ తో దీనికి సీక్వెల్ గా రాబోయే మూవీ పైన ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉన్నాయి.

కచ్చితంగా 'కల్కి పార్ట్ 2' మూవీ 'బాహుబలి 2' కలెక్షన్స్ ని అధికమిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 2026లో పార్ట్ 2 థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవల్ లో చాలా ఈవెంట్స్ లో కల్కి స్క్రీనింగ్ జరిగింది. ఇప్పుడు మరో రేర్ ఫీట్ ని అందుకోబోతోంది. 29వ బుసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కల్కి '2898ఏడీ' ప్రదర్శనకి సిద్ధం అవుతోంది.

ఈ బుసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అక్టోబర్ 2 నుంచి 11 వరకు జరగనుంది. ఇందులో బిగ్గెస్ట్ అవుట్ డోర్ థియేటర్ అయిన BIFF లో అక్టోబర్ 8, 9వ తేదీలలో 'కల్కి 2898ఏడీ' సినిమాని స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ స్క్రీనింగ్ కి నాగ్ అశ్విన్ తో పాటు మూవీ టీమ్ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. హాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలు కూడా ఈ ఈవెంట్ కి అటెండ్ అవుతారు. వారిలో చాలా మంది BIFF థియేటర్ లో 'కల్కి 2898ఏడీ' సినిమాని థియేటర్ ఎక్స్ పీరియన్స్ లో ఆస్వాదించబోతున్నారు.

ఈ సినిమాలో ఇండియన్ స్టార్ యాక్టర్స్ అయిన కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే కీలక పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ కెరియర్ లో 'బాహుబలి 2' తర్వాత సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా 'కల్కి' మూవీ నిలిచింది. వరల్డ్ వైడ్ గా 1150 కోట్ల కలెక్షన్స్ ని ఈ సినిమా వసూళ్లు చేసింది. ఇక 'కల్కి' సీక్వెల్ మూవీని 600+ కోట్ల తో మరింత గ్రాండ్ గా నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్నాడు.

ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది 'కల్కి 2898ఏడీ పార్ట్ 2' మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ మొదటి సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్, విమర్శలని పరిగణలోకి తీసుకొని పార్ట్ 2 స్క్రిప్ట్ ని మరింత పవర్ఫుల్ గా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.