Begin typing your search above and press return to search.

కల్కి మరో సమరానికి రెడీ..!

ఐతే కల్కి 2898 AD ఇప్పుడు మరో సమరానికి రెడీ అవుతుంది. ఈ సినిమా జపాన్ రిలీజ్ కు రెడీ అయ్యింది. జనవరి 3న జపాన్ లో కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది.

By:  Tupaki Desk   |   18 Dec 2024 5:48 AM GMT
కల్కి మరో సమరానికి రెడీ..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా కల్కి 2898 AD. వైజయంతి బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మించారు. విజువల్ వండర్ గా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అంతేకాదు ప్రభాస్ ఖాతాలో మరో 1000 కోట్ల సినిమాగా చేరింది. కల్కి సినిమా మొదటి పార్ట్ లో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె కూడా వారి బెస్ట్ ఇచ్చారు.

ఐతే కల్కి 2898 AD ఇప్పుడు మరో సమరానికి రెడీ అవుతుంది. ఈ సినిమా జపాన్ రిలీజ్ కు రెడీ అయ్యింది. జనవరి 3న జపాన్ లో కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది. ఇండియన్ సినిమాలకు జపాన్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. మన దగ్గర సూపర్ హిట్ అయిన ప్రతి సినిమా జపాన్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఐతే జపాన్ లో కల్కి రిలీజ్ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ అక్కడి ప్రేక్షకుల ప్రేమను చూసి ఆశ్చర్యపోయాడు.

తన మీద తన సినిమా మీద జపాన్ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు నాగ్ అశ్విన్ షాక్ అయ్యాడు. అంతేకాదు సినిమా గురించి తనకు వచ్చిన లెటర్స్ ని తన చుట్టూ పేర్చుకుని ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు నాగ్ అశ్విన్. జపాన్ ప్రేక్షకుల ప్రేమలో తడిసి ముద్దవుతున్నాడు నాగ్ అశ్విన్. కల్కి సినిమా జపాన్ లో భారీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తప్పకుండా అక్కడ సెన్సేషనల్ హిట్ అవుతుందని అనుకుంటున్నారు.

కల్కి బాక్సాఫీస్ వసూళ్ల హంగామా మళ్లీ జనవరి 3, 2025 నుంచి మొదలవుతుంది. RRR తర్వాత జపాన్ లో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాగా కల్కి సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది. కల్కి జపాన్ రిలీజ్ పై రెబల్ ఫ్యాన్స్ సూపర్ ఖుషిగా ఉన్నారు. మరో పక్క కల్కి 2 సినిమా కోసం కూడా ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. 2025 ఏప్రిల్, మే లో కల్కి 2 మొదలు పెట్టి 2026 సెకండ్ హాఫ్ లేదా 2027 మొదట్లో రిలీజ్ ఉంటుందని వైజయంతి నిర్మాత అశ్వనీదత్ వెల్లడించారు. కల్కి 2 లోనే అసలు కథ ఉంటుందని తెలుస్తుండగా సినిమా పై రెబల్ ఫ్యాన్స్ అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.