Begin typing your search above and press return to search.

కల్కికి హ్యాండ్ ఇచ్చిన బీ టౌన్ హీరోయిన్..?

హైదారాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కలకత్తా ఇలా అన్ని మేజర్ సిటీస్ లో కల్కి ప్రమోషన్స్ జరగనున్నాయని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   4 Jun 2024 2:05 PM GMT
కల్కికి హ్యాండ్ ఇచ్చిన బీ టౌన్ హీరోయిన్..?
X

500 కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా కల్కి. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మరో 23 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించాలని చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. ఇప్పటికే బుజ్జిని పరిచయం చేసి సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టాడు నాగ్ అశ్విన్ ఇక మరోపక్క ఆల్ ఓవర్ ఇండియా ప్రమోషన్స్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. హైదారాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కలకత్తా ఇలా అన్ని మేజర్ సిటీస్ లో కల్కి ప్రమోషన్స్ జరగనున్నాయని తెలుస్తుంది.

ఈ ఏరియాల్లో రెండు చోట్ల భారీ ఈవెంట్ ని ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఐతే అంతా బాగానే ఉంది కానీ ప్రభాస్ కల్కిలో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొనె ఎక్కడ కనిపించట్లేదు ఏంటని రెబల్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్ కూడా పాల్గొంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా దీపికా పదుకొనె మొదటిసారి తెలుగు సినిమాలో నటిస్తుంది. మరి ఈ సినిమాకు దీపికా ప్రమోషన్స్ కు టైం కేటాయించకపొవడం ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తుంది.

దీపికా ప్రస్తుతం బేబీ బంప్ తో ఉంది. ఈ టైం లో ప్రమోషన్స్ కి రావడం కష్టం. కానీ కల్కి ఈవెంట్స్ జరుగుతున్నా అసలు కనీసం సినిమాతో తనకు సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తుంది దీపికా. ఇంతవరకు కల్కి సినిమా గురించి ఆమె ఎక్కడ నోరు విప్పలేదు. ఈవెంట్స్ లో పాల్గొనక పోయినా ఒక వీడియో బైట్ ఇచ్చినా బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

రామోజి ఫిల్మ్ సిటీలో జరిగిన కల్కి ఈవెంట్ లో ప్రభాస్ మాత్రం గుర్తుంచుకుని మరీ దీపికాని ఆకాశానికి ఎత్తేశాడు. మరి అలాంటిది సినిమాకు భారీ రెమ్యునరేషన్ తీసుకుని పనిచేసిన హీరోయిన్ దీపికాకు ఆమాత్రం బాధ్యత లేకపోతే ఎలా అంటున్నారు ఆడియన్స్. మరి రాబోతున్న కల్కి ప్రమోషన్స్ లో అయినా సరే దీపికా పదుకొనె పాల్గొంటే బాగుంటుందని చెప్పొచ్చు. ప్రభాస్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో చాలామంది తారలు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తారని తెలుస్తుంది. నాగ్ అశ్విన్ ఈ సినిమాతో చాలా పెద్ద స్కెచ్ వేశాడని చెప్పొచ్చు.