ఆ దేశంలో 'కల్కి 2898 ఏడీ' రీ రిలీజ్
ఇండియాలోనే కాకుండా రష్యాలోనూ 'కల్కి 2898 ఏడీ' సినిమా రీ రిలీజ్ అయింది.
By: Tupaki Desk | 1 Nov 2024 3:30 PM GMTప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొంది ఈ ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కల్కి 2898 ఏడీ' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కల్కి సినిమా ఇటీవల ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియాలో పలు చోట్ల రీ రిలీజ్ అయిన కల్కి సినిమాకు మంచి స్పందన దక్కింది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు, సాధారణ ప్రేక్షకులు సైతం కల్కి సినిమాను మరోసారి థియేటర్‌కు వెళ్లి మరీ చూడటం జరిగింది అంటే సినిమాకు ఏ స్థాయిలో స్పందన దక్కిందో అర్థం చేసుకోవచ్చు.
ఇండియాలోనే కాకుండా రష్యాలోనూ 'కల్కి 2898 ఏడీ' సినిమా రీ రిలీజ్ అయింది. భారీ అంచనాల నడుమ రష్యన్ భాషలో విడుదల అయిన ఈ సినిమాను మరోసారి అక్కడ ప్రేక్షకులు ఆదరించారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన కల్కి సినిమాను అక్కడి ప్రేక్షకులు ఆదరించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమా రష్యాలో విడుదల అయిన సమయంలో 1.64 మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేయడం జరిగింది. భారీ వసూళ్లు దక్కించుకున్న నేపథ్యంలో రీ రిలీజ్ కు ఏపాటి స్పందన ఉంటుందో అని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ రీ రిలీజ్ లోనూ కల్కి సినిమాకు రష్యాలో మంచి స్పందన దక్కింది.
విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కల్కి సినిమా రష్యన్ భాషలో రీ రిలీజ్ అయ్యి మరో మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఒక ఇండియన్ సినిమా రష్యన్ భాషలో రెండో సారి విడుదల అయ్యి ఈ స్థాయి వసూళ్లు సాధించడం ముందు ముందు కూడా సాధ్యం కాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభాస్ పై అక్కడి ప్రేక్షకుల్లో ఉన్న అభిమానం, సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన విధానం వల్లే ఈ స్థాయి సక్సెస్ దక్కిందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
కల్కి 2898 ఏడీ సినిమా కథలో మహాభారతం ను లింక్ చేసిన విధానం కు అంతా ఫిదా అయ్యారు. ప్రేక్షకులకు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చూపిస్తూనే పురాణాలతో ఎలా లింక్ అయ్యి మన జీవితం, మన చుట్టూ ఉన్న ప్రపంచం సాగుతుంది అనేది దర్శకుడు అద్భుతంగా చూపించారు. అమితాబచ్చన్ కి అద్భుతమైన పాత్ర ఇవ్వడం ద్వారా నాగ్ అశ్విన్ సినిమాను మరో స్థాయికి తీసుకు వెళ్లారు. దీపికా పదుకునే పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. దిశా పటానీ కొంత సమయం ఉన్నా మెప్పించింది. సినిమాలో లెక్కకు మించిన గెస్ట్ అప్పియరెన్స్ లు ఉండటంతో ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవుతూనే ఉంటారు. ముందు ముందు సైతం కల్కి సీక్వెల్ తో ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవ్వడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.