Begin typing your search above and press return to search.

దీపిక అంత‌ర్జాతీయ సూప‌ర్‌స్టార్.. డార్లింగ్ అలా అనేశాడేంటి!

అలాగే అప్ప‌ట్లో ఒక ప్ర‌చార వీడియోలో ప్ర‌భాస్ కంటే తాను ఉత్త‌మ స్థానంలో ఉన్నాన‌ని దీపిక పేర్కొంది

By:  Tupaki Desk   |   23 May 2024 3:44 AM GMT
దీపిక అంత‌ర్జాతీయ సూప‌ర్‌స్టార్.. డార్లింగ్ అలా అనేశాడేంటి!
X

ప్ర‌భాస్ వ‌ర్సెస్ దీపిక ప‌దుకొనే ఎపిసోడ్స్ ని అభిమానులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. డార్లింగ్ ప్ర‌భాస్ కంటే ప‌ది మెట్లు పైనే ఉన్నాన‌ని దీపిక ప‌దుకొనే బెట్టు చేసింది. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్.కె (కల్కి 2989 AD) కోసం దీపిక‌ను సంప్ర‌దించ‌గా, భారీ పారితోషికం డిమాండ్ చేసింద‌ని ప్ర‌చార‌మైంది. తాను అడిగినంతా ఇచ్చాకే ప్రాజెక్ట్ లో చేరింద‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి.

అలాగే అప్ప‌ట్లో ఒక ప్ర‌చార వీడియోలో ప్ర‌భాస్ కంటే తాను ఉత్త‌మ స్థానంలో ఉన్నాన‌ని దీపిక పేర్కొంది. దానికి ప్ర‌భాస్ అభిమానులు చాలా సీరియ‌స్ అయ్యారు. అంతేకాదు ఈ సినిమా నుంచి దీపికను త‌ప్పించాల‌ని కూడా కోరుకున్నారు. కానీ అన్నిటినీ కామ‌ప్ చేసి చివ‌రికి దీపిక‌తోనే నాగ్ అశ్విన్ కొన‌సాగారు. అయినా ప్ర‌భాస్ అభిమానులు మాత్రం శాంతించ‌లేదు. ఆ త‌ర్వాత చాలా కాలం పాటు దీపిక‌పై త‌మ కోప‌తాపాల‌ను సోష‌ల్ మీడియాల ద్వారా ప్ర‌ద‌ర్శించారు.

అదంతా అటుంచితే ఇప్పుడు దీపిక ప‌దుకొనేను బుజ్జి లాంచింగ్ ఈవెంట్లో ప్ర‌భాస్ ఆకాశానికెత్తేశాడు. దీపిక బిగ్గెస్ట్ సూప‌ర్ స్టార్ అని పొగిడేశాడు. అంత‌ర్జాతీయ స్టార్ అని .. అంత‌ర్జాతీయ బ్రాండ్ల‌కు ప్ర‌చారం చేస్తుంద‌ని కూడా కితాబిచ్చేశాడు. మీరు భార‌త సినీప‌రిశ్ర‌మ‌లో ఉండ‌డం అదృష్టం అని ప్ర‌శంసించారు. అలాగే దిశా పటానీని హాట్ స్టార్ అని నిర్మాత స్వ‌ప్నాద‌త్ పిలుస్తార‌ని కూడా గుర్తు చేసుకున్నాడు డార్లింగ్. త‌న సినిమాలో న‌టించిన అంద‌రికీ ప్ర‌భాస్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరిగిన భారీ ఈవెంట్‌లో ప్రభాస్ `కల్కి 2989 AD` నుండి బుజ్జి అనే ఫ్యూచరిస్టిక్ కార్‌ని పరిచయం చేసారు. ప్ర‌స్తుతం బుజ్జి ప‌రిచ‌య వీడియోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క‌థాంశం హిందూ పురాణాల నుండి ప్రేరణ పొందింది. అపోకలిప్టిక్ ప్రపంచంలోని మానవాళిని రక్షించడానికి కల్కి మిషన్ ఏమిట‌న్న‌దే ఈ సినిమా క‌థాంశం. డార్లింగ్ ప్ర‌భాస్ ఇందులో భైర‌వ అనే పాత్ర‌లో న‌టించాడు. ఈవెంట్‌లో 15,000 మంది పాల్గొన్నారని ఒక అంచ‌నా. కల్కి 2989 ADలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గ‌జ న‌టులతో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు అని ప్రభాస్ అన్నారు.