Begin typing your search above and press return to search.

భైరవ యాక్షన్ డోస్ లో పంజాబీ వైబ్!

పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 ఎ.డి.' చిత్రం పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది

By:  Tupaki Desk   |   17 Jun 2024 9:37 AM GMT
భైరవ యాక్షన్ డోస్ లో పంజాబీ వైబ్!
X

పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 ఎ.డి.' చిత్రం పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 27న థియేటర్స్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఇప్పటికే ట్రైలర్ ద్వారా మంచి స్పందన వచ్చింది. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో రూపొందిన విజువలైజేషన్, కంటెంట్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు మాములుగా లేవు. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు మొదటి రోజు కల్కి భారీ వసూళ్లను రాబడుతుందని ఆశిస్తున్నారు. ట్రేడ్ పండితులు కూడా ఈ సినిమాపై సానుకూల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బిజినెస్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.

సినిమా ప్రమోషన్స్ విషయంలో మరింత జోరు చూపిస్తూ చిత్ర యూనిట్ ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా 'కల్కి' నుండి భైరవ ఆంథమ్ ప్రోమోను విడుదల చేసింది. దల్జీత్ దోసాంజ్ మరియు ప్రభాస్ ని ఎస్టాబ్లిష్ చేయడం విశేషం. భైరవ ఆంథమ్ లో ఇద్దరూ కూడా హైలెట్ అయ్యారు సమాచారం. పంజాబీ స్టైల్ లో ఉండబోతున్న ఈ ఆంథమ్ ను దల్జీత్ దోసాంజ్ పాడిన విధానం మరింత హైలెట్ గా నిలిచింది.

అలాగే సాంగ్ వీడియో లో బుజ్జి కారును హైలెట్ చేశారు. భైరవ చేసే సాహసాలు ఎలా ఉంటాయో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఈ వీడియో సాంగ్ తో మరింత హైప్ పెంచారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సాంగ్ కి మ్యూజిక్ అందించారు. ఈ ఆంథమ్ ప్రేక్షకులకి మంచి కనెక్షన్ ఇస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఇదిలా ఉంటే 'కల్కి 2898 ఎ.డి.' చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించారు.

స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే, దిశా పటాని ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. రాజేంద్రప్రసాద్ కూడా ఓ ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపిస్తున్నారు. ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ఇక భైరవ ఆంథమ్ సినిమాకు మరింత హైప్ తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.