Begin typing your search above and press return to search.

కల్కి2898ఏడీ.. ఈ బిగ్ డీల్స్ నిజమేనా?

అలాగే సౌత్ వెర్షన్స్ అన్ని కలిపి 100 కోట్లకి పైగా ప్రైమ్ వీడియోస్ కి అమ్మినట్లు టాక్ వినిపిస్తోంది. అంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ద్వారానే ఏకంగా 250 కోట్లకు పైగా రిలీజ్ కి ముందు అందుకున్నట్లు గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   22 May 2024 4:10 AM GMT
కల్కి2898ఏడీ.. ఈ బిగ్ డీల్స్ నిజమేనా?
X

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898ఏడీ. మైథాలజీ కథలని బేస్ చేసుకొని సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి2898ఏడీని నాగ్ అశ్విన్ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా ఈ చిత్రం ఉండబోతోంది. జూన్ 27న ఈ చిత్ర ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇండియాలో ఇది వరకు ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ మూవీని అత్యధిక స్క్రీన్స్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. మరో వైపు మూవీ బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ చేసే పనిలో నిర్మాతలు ఉన్నారు. మేగ్జిమమ్ ఏరియాలలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లోనే సొంతంగా కల్కి సినిమాని రిలీజ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. డిస్టిబ్యూటర్స్ తో కమిషన్ బేస్డ్ గా మాట్లాడుకొని రిలీజ్ చేస్తున్నారు. కొన్ని ఏరియాలలో నిర్మాతలు చెప్పిన ధర చెల్లించడానికి డిస్టిబ్యూటర్స్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కల్కి 2898ఏడీ డిజిటల్ రైట్స్ గురించి మరో ఆసక్తికరమైన టాక్ వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని సలార్ తరహాలోనే రెండు ఓటీటీలకి లాంగ్వేజ్ బేస్డ్ గా అమ్మారంట. సౌత్ లాంగ్వేజ్ లకి సంబందించిన రైట్స్ ని ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. అలాగే హిందీ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందంట. కల్కి హిందీ వెర్షన్స్ డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ కలుపుకొని 160 కోట్ల వరకు నిర్మాతలకి వచ్చినట్లు ఒక టాక్ వైరల్ అవుతోంది.

అలాగే సౌత్ వెర్షన్స్ అన్ని కలిపి 100 కోట్లకి పైగా ప్రైమ్ వీడియోస్ కి అమ్మినట్లు టాక్ వినిపిస్తోంది. అంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ద్వారానే ఏకంగా 250 కోట్లకు పైగా రిలీజ్ కి ముందు అందుకున్నట్లు గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. థీయాట్రికల్ బిజినెస్ రేంజ్ 400 కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కల్కి మూవీ కచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంటుందని భావిస్తున్నారు.

బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మూవీలో లీడ్ రోల్ లో నటిస్తూ ఉండగా దీపికా పదుకునే, దిశా పటాని ప్రభాస్ కి జోడీగా కనిపిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, యూనివర్శల్ యాక్టర్ కమల్ హాసన్ కీలక పాత్రలలో నటించారు. పాన్ వరల్డ్ మూవీగా ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది. మరి ఈ చిత్రం టాలీవుడ్ లో ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.