Begin typing your search above and press return to search.

కల్కి 2898 AD.. ఎన్నికల్లో ఎవరు గెలిస్తే నాకెందుకండి?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏడీ

By:  Tupaki Desk   |   11 May 2024 6:15 AM GMT
కల్కి 2898 AD.. ఎన్నికల్లో ఎవరు గెలిస్తే నాకెందుకండి?
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏడీ. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జూన్ 27న సినిమాని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీగా కల్కి చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. నాగ్ అశ్విన్ దగ్గరుండి తనకి కావాల్సిన అవుట్ ఫుట్ ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి మే 10న కల్కి మూవీని రిలీజ్ చేయాలని అనుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి నడుస్తోన్న నేపథ్యంలో రిలీజ్ వాయిదా వేశారు.

కల్కి 2898ఏడీ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన విశేషాలని స్వప్నదత్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటో స్టోరీ షేర్ చేశారు. ఇందులో నాగ్ అశ్విన్, స్వప్నదత్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా కల్కి మూవీ హైదరాబాద్ కంపెనీలో గ్రాఫిక్స్ టీమ్ అందరూ కూడా ఎలక్షన్స్ కోసం వెళ్లిపోయారు అని నాగ్ అశ్విన్ అన్నారు.

ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు నాగి అని స్వప్నదత్ ప్రశ్నించారు. దానికి నాగ్ అశ్విన్ సరదాగా రియాక్ట్ అయ్యి ఎవరు గెలిస్తే నాకెందుకండి. నా షాట్స్ ఎప్పుడు వస్తాయో నాకు కావాలి గానీ అంటూ సరదాగా రియాక్ట్ అయ్యారు. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి సంబంధించి వారిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగినట్లు ఈ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ బట్టి అర్ధమవుతోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని త్వరలో రిలీజ్ చేయడానికి న నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే టీజర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందంట. ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, దిశా పటాని కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ తోనే మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కమల్ హాసన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. అలాగే మూవీలో ప్రభాస్ రెండు భిన్నమైన క్యారెక్టర్స్ లో కల్కి చిత్రంలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా 22 భాషలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కల్కి 2898ఏడీ మూవీతో సౌత్ సినిమాకి హాలీవుడ్ లో మార్కెట్ గేట్స్ ని ప్రభాస్ ఓపెన్ చేయబోతున్నాడనే మాట వినిపిస్తోంది.