Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల 'కల్కి' దిశా ఫోజ్ అదుర్స్‌

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌ గా దీపికా పదుకునే నటిస్తోంది

By:  Tupaki Desk   |   13 Jun 2024 6:53 AM GMT
పిక్ టాక్ : అందాల కల్కి దిశా ఫోజ్ అదుర్స్‌
X

తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న కల్కి సినిమాను ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌ గా దీపికా పదుకునే నటిస్తోంది.

కల్కి 2898 ఏడీ సినిమాలో దీపికా పదుకునేతో పాటు బాలీవుడ్ మరో స్టార్‌ సెన్షేషనల్‌ బ్యూటీ దిశా పటానీ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల విడుదల అయిన ట్రైలర్‌ ను చూస్తే సినిమాలో దీపిక కి ఏమాత్రం తగ్గకుండా దిశా పాత్ర ఉంటుందా అన్నట్లుగా పరిస్థితి ఉంది.

దిశా పటానీ కి సంబంధించిన కల్కి లుక్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా మరో ఆసక్తికర పోస్టర్‌ ను ఆమె ఫ్యాన్స్ కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేయడం జరిగింది. ఎప్పటిలాగే ఆకట్టుకునే విధంగా ఉందంటూ కల్కి ఫ్యాన్స్ ఈ పోస్టర్ కి కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ దిశా పటానీ నెటిజన్స్ ని ఉర్రూతలూగిస్తూ ఉంటుంది. అలాంటి ముద్దుగుమ్మ దిశా పటానీ మరోసారి కల్కి సినిమా పోస్టర్‌ లోనూ అందాల ఆరబోత తో చూపు తిప్పుకోనివ్వడం లేదు.

నడుము అందాలను చూపిస్తూ, నాభి అందాలతో కవ్విస్తున్న ఈ బ్యూటీ కల్కి సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇంతటి స్టైలిష్ లుక్ లో, ఇంతటి గ్లామర్‌ లుక్ లో చూడలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.