'కల్కి' లీగల్ యాక్షన్.. వారందరికీ వార్నింగ్
అయితే తాజాగా ఈ విషయం నిజమేనని అర్థమైంది. లీకర్స్కు, అలాగే లీకైనా వాటిని షేర్ చేసే వాళ్లకు ముందస్తు హెచ్చరిక జారీ చేశారు మూవీ మేకర్స్.
By: Tupaki Desk | 21 Sep 2023 9:07 AMఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా 'కల్కీ-2898ఏడి'. ఈ చిత్ర బడ్జెట్ రూ.500 కోట్లకు పైమాటే అని చెబుతున్నారు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నట్లు మొదటి నుంచి ప్రచారం చేస్తూనే వస్తున్నారు. అందుకు తగ్గట్లే గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు కూడా. అయితే ఈ చిత్రానికి కూడా లీకుల బెదడ మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దీనిపై మూవీటీమ్ లీగల్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా ఈ విషయం నిజమేనని అర్థమైంది. లీకర్స్కు, అలాగే లీకైనా వాటిని షేర్ చేసే వాళ్లకు ముందస్తు హెచ్చరిక జారీ చేశారు మూవీ మేకర్స్. "కల్కి 2898 ఏడీ సినిమా, దానికి సంబంధించిన ఏ విషయమైనా కాపీరైట్స్ పరిధిలోకి వస్తాయి. సినిమాకు సంబంధించి సీన్స్, ఫుటేజ్‌లు లేదా ఫొటోస్ ఏదీ షేర్ చేసినా అది చట్ట విరుద్ధం. అందుకు చట్ట పరమైన శిక్ష ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ చర్యలకు పాల్పడితే తప్పకుండా సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా మేం లీగల్ యాక్షన్ తీసుకుంటాం" అని మూవీటీమ్ నోట్ రిలీజ్ చేసింది.
ఇకపోతే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ లీక్‌ల విషయంపై పెద్ద చర్చలే జరుగుతున్నాయని తెలిసింది. రీసెంట్గా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాల నుంచి కూడా సాంగ్, పిక్స్ లీక్‌లు అయ్యాయి. అయితే దీనిపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సీరియ్ కూడా అయ్యారు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ కూడా ఫైల్ చేస్తూ హెచ్చరిక జారీ చేశారు.
కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. మొదట ట్రోలింగ్ జరిగినా తర్వాత మంచిగానే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమా రిలీజయ్యే అవకాశం ఉంది.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ కల్కి సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే, దిశా పటానీ నటిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.