Begin typing your search above and press return to search.

ప్రభాస్ కల్కిలో మరో మంచి స్టార్.. కన్ఫామ్ అయినట్టే

మహానటి ఫేమ్ నాగ్‌ అశ్విన్‌ - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కలయికలో తెరకెక్కుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ కల్కి 2898 ఏడీ

By:  Tupaki Desk   |   18 Aug 2023 10:20 AM GMT
ప్రభాస్ కల్కిలో మరో మంచి స్టార్.. కన్ఫామ్ అయినట్టే
X

మహానటి ఫేమ్ నాగ్‌ అశ్విన్‌ - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కలయికలో తెరకెక్కుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ చిత్రం డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది విపరీతంగా వైరల్ అవుతూనే ఉంది.

అయితే ఈ చిత్రంలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించనున్నారనే వార్తలు చాలా కాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై దుల్కర్ స్పందించారు. తన కొత్త మూవీ కింగ్‌ ఆఫ్‌ కోత ప్రమోషన్‌లో ఈ విషయం గురించి మాట్లాడారు. అటు ఎస్ అని చెప్పలేదు అలా అని నో కూడా చెప్పలేదు.

నేను ఈ చిత్రంలో భాగమా కాదా అనేది ఇప్పుడైతే చెప్పలేను. కానీ, నేను కల్కి షూటింగ్ సెట్‌కు వెళ్లినప్పుడు ఎంతో సర్ ప్రైజ్ అయ్యాను. నాగ్‌ అశ్విన్‌ మొదటి సినిమా ఎవడే సుబ్రమణ్యం.. ఆయన రెండో చిత్రం మహానటికి అస్సలు సంబంధం ఉండదు. అలా ఇప్పుడు ఆయన మూడో చిత్రం కల్కికి కూడా అంతే. మొత్తం డిఫరెంట్. వేరు వేరు జానర్స్ లో తీస్తున్నారు. ఆ చిత్రాన్ని అంత గొప్పగా ఆయన మాత్రమే తీయగలరు. అలాంటి ఆలోచనలు ఆశ్విన్ కు మాత్రమే వస్తాయి.

ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించలేదు అని దుల్కర్ చెప్పారు. ఈ సినిమాలో మీకు ఎవరితోనైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా అని అడగగా.. ఆ విషయాన్ని మూవీ మేకర్స్‌ మాత్రమే చెప్పాలి అని దుల్కర్‌ పేర్కొన్నారు. దీంతో ఆయన ఈ చిత్రంలో నటించడం పక్కా అని స్పష్టమవుతోందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఇప్పటికే కల్కి చిత్రంలో చాలా మంది బిగ్ స్టార్స్ నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌, హాట్ బ్యూటీస్ దిశా పటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ బలమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రీసెంట్ గా ప్రతిష్టాత్మక కామిక్ కాన్ వేదికగా రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ పర్వాలేదనిపించింది. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.