'అవెంజర్స్' లో కాల కంటే 'కల్కి' లోకం ఎలా డిఫరెంట్?
హాలీవుడ్‌లో అవెంజర్స్ ఫ్రాంఛైజీ సృజనాత్మక ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాలను దోచింది
By: Tupaki Desk | 31 Dec 2023 5:47 AM GMTహాలీవుడ్‌లో అవెంజర్స్ ఫ్రాంఛైజీ సృజనాత్మక ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాలను దోచింది. అవతార్, బ్లాక్ పాంథర్, యాంట్ మేన్, స్టార్ వార్స్, ఎక్స్ మెన్, మిషన్ ఇంపాజిబుల్ ఇవన్నీ ఫ్రాంఛైజీ కల్చర్ లో అద్భుతాలు చేసి చూపించాయి. ఇందులో కొన్ని సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ప్రజల్ని కొత్త లోకాల్లో విహరింపజేసాయి. అందుకే ఇప్పుడు నాగ్ అశ్విన్ సృష్టిస్తున్న కొత్త లోకం ప్రజల్ని ఏమేరకు ఆకట్టుకుంటుంది? అన్న సందేహం ప్రభాస్ అభిమానులు సహా ప్రజల్లో ఉంది. కల్కి 2898 AD పూర్తిగా కల్పిత లోకంలో సాగే కథాంశం. ఇది భారీ కాన్వాస్ తో రూపొందుతున్నది. అయితే కల్కి చిత్రం హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రాల కంటే ఎలా డిఫరెంట్? అన్న ప్రశ్నకు సృజనాత్మక దర్శకుడు నాగ్ అశ్విన్ సమాధానమిచ్చారు.
సలార్ తర్వాత 2024 మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఎడి' భారతీయ సినీప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే అద్భుత కంటెంట్ తో వస్తున్న సినిమాగా ప్రచారం ఉంది. నిర్మాతలు ఇప్పటికే ప్రచారంలో వేడి పెంచుతున్నారు. జూలైలో శాన్ డియాగో కామిక్-కాన్‌లో సినిమా టైటిల్‌ను ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా భారీ బజ్‌ని సృష్టించారు. ఇటీవల IIT బాంబే టెక్‌ఫెస్ట్‌లో కల్కి బృందం ప్రత్యేకంగా క్యూరేటెడ్ కంటెంట్‌ను ప్రదర్శించడం ద్వారా ప్రభాస్ అభిమానుల్లో ఉన్మాదం రేకెత్తించింది.
టెక్‌ఫెస్ట్ లో 'కల్కి 2898 AD' దర్శకుడు నాగ్ అశ్విన్ తన సినిమా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల కంటే ఏ విధంగా డిఫరెంట్ అన్నదాని గురించి ప్రస్థావించారు. కల్కి 2898 AD భారతీయ సినీపరిశ్రమలో రూపొందించిన మొదటి నిజమైన సైన్స్ ఫిక్షన్ చిత్రం అని నాగ్ అశ్విన్ వెల్లడించారు. కల్కి డిఫరెంట్ సినిమా. కథ పూర్తిగా కొత్త లోకంలో సాగుతుంది. హాలీవుడ్ ఫ్రాంఛైజీ చిత్రాల్లో భవిష్యత్ నగరాలను ఎలా చిత్రీకరించారో మనమంతా చూశాము. కల్కి 2898 ADలో భవిష్యత్తులో భారతీయ నగరాలు ఎలా ఉంటాయో ప్రేక్షకులు చూస్తారు. ఈ చిత్రానికి బలమైన భారతీయ అనుబంధం ఉంది! అని దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు.
భారతీయ చలనచిత్ర రంగంలో పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటుతున్న ప్రభాస్ తో కలిసి దిగ్గజ తారలు అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కల్కి 2898 AD వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు. థియేట్రికల్ ట్రైలర్‌ను 93 రోజుల్లో విడుదల కానుంది. 31 మార్చి లేదా 1 ఏప్రిల్ 2024న విడుదలవుతుందని చెబుతున్నారు. సినిమా రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.