ప్రభాస్.. ఆ క్యారెక్టర్ గుర్తుండిపోయేలా..
ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఏకంగా 500 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు
By: Tupaki Desk | 23 March 2024 4:44 AM GMTప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీ. రెండు భాగాలుగా సిద్ధం అవుతోన్న ఈ మూవీ మొదటి పార్ట్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. మే నెలలో రిలీజ్ అనుకున్నప్పటికి ఎలక్షన్స్ కారణంగా జూన్ లేదా ఆగష్టుకి వాయిదా పడొచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఏకంగా 500 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు రానటువంటి ఫ్యూచరిస్టిక్ జోనర్ లో కల్కి చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని అంతర్జాతీయ వేదికలపై చిత్ర యూనిట్ చేస్తోంది. నిర్మాతలుగా ఉన్న స్వప్న దత్, అశ్వినీ దత్, మరో వైపు దర్శకుడు నాగ్ అశ్విన్ వరల్డ్ వైడ్ గా కల్కి కంటెంట్ ని హై లెవెల్లో జనాలకు రీచ్ అయ్యేలా ప్రమోట్ చేస్తున్నారు. తాజా గా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్వప్న దత్ కల్కి సినిమా గురించి మాట్లాడారు.
అందులో హోస్ట్ కల్కి గురించి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ.. సినిమాలో భైరవ క్యారెక్టర్ కల్కి 2898 ఏడీ రిలీజ్ తర్వాత కూడా చాలా కాలం పాటు గుర్తుండిపోతుందని, అంత అద్భుతంగా ఆ క్యారెక్టరైజేషన్ ఉండబోతోందని చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ బాహుబలి తరువాత జనాల్లో ఆ రేంజ్ లో గుర్తుండి పోయే క్యారెక్టర్ అయితే చేయలేదు. దీంతో భైరవ క్యారెక్టర్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి. రీసెంట్ గా శివరాత్రి సందర్భంగా కల్కి మూవీ నుంచి భైరవ క్యారెక్టర్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
కాశీ వీధుల్లో తిరిగే మహా శివుడి ప్రతిరూపంగా ఈ భైరవ క్యారెక్టర్ ఉండబోతోందనే ప్రచారం నడుస్తోంది. ప్రభాస్ రెండు భిన్నమైన క్యారెక్టర్స్ లో మూవీలో కనిపించబోతున్నాడని అర్ధమవుతోంది. అందులో శ్రీ మహావిష్ణువు 10వ అవతారం అయిన కల్కి ఒకటి కాగా, పరమేశ్వరుడి అవతారం అయిన భైరవ మరొకటని తెలుస్తోంది. కలియుగాంతంలో జరిగే కథాంశంగా ఈ మూవీ ఉండబోతోంది.
ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని కల్కి 2898 ఏడీ సినిమాని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ కలిపురుషుడి పాత్రలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. అమితాబచ్చన్ అశ్వద్దామ మాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకునే, దిశా పటాని కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీతో హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఈ మూవీ ఉండబోతోందని సమాచారం.