Begin typing your search above and press return to search.

కల్కి 2898 AD - అండర్‌వాటర్ ట్విస్ట్!

ఇక విడుదలైన టీజర్లు బోనస్ గా మారుతున్నాయి. ఇక సాంగ్స్ తో మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది

By:  Tupaki Desk   |   5 Jun 2024 1:36 PM GMT
కల్కి 2898 AD - అండర్‌వాటర్ ట్విస్ట్!
X

సూపర్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా చిత్రం "కల్కి 2898 ఏడి" ప్రమోషన్స్ తో మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. నిర్మాత అశ్వినీ దత్ ఇప్పటికే పొలిటికల్ మ్యాటర్ తో మంచి హైప్ క్రియేట్ చేశారు. ఇక సినిమా నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ వెబ్ సీరీస్ కు సాలీడ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక విడుదలైన టీజర్లు బోనస్ గా మారుతున్నాయి. ఇక సాంగ్స్ తో మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఇక సినిమాలో సాంగ్స్ మాత్రమే కాకుండా వాటి మేకింగ్ కొరియోగ్రఫీ కూడా ఇంకా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. అండర్‌వాటర్ లో ఇప్పటివరకు థ్రిల్లింగ్ సీన్స్ యాక్షన్ సీన్స్ చూసి ఉంటారు. కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్లాన్ తో సాంగ్ ను డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.

త్వరలోనే ఆ రొమాంటిక్ సాంగ్ విడుదలకు సిద్దమవుతోంది. ఈ పాటను యూరప్‌లో చిత్రీకరించారు. అభిమానులు ఈ పాట విడుదల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ పాట విడుదల కానుందని సమాచారం. ఈ సాంగ్‌లో సముద్రం లోతుల్లో తీసిన సన్నివేశాలు ఉండనున్నాయి. అండర్‌వాటర్ ప్రపంచ అందాలను చూపిస్తూ ఈ పాట దృశ్యపరంగా అద్భుతంగా ఉండబోతోందని తెలుస్తోంది.

అంతకుముందు, దిశా పటానీ విదేశీ లొకేషన్ నుంచి కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు అదే పాటకు సంబంధించినవా లేదా అనేది తెలియదు కానీ, అభిమానులు ఫైనల్ అవుట్‌పుట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. "బుజ్జి & భైరవ" యానిమేటెడ్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత వారి అంచనాలు మరింత పెరిగాయి. దిశా పటానీ గ్లామర్ కూడా ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం.

"కల్కి 2898 ఏడి"లో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ప్రతిభావంతుల నటీనటులు ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషనల్ దశలో ఉంది. ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ అండర్‌వాటర్ రొమాంటిక్ సాంగ్ విడుదల అవుతుందని సమాచారం.